News August 4, 2024

చేజారిన గోల్డ్ ఆశలు.. లక్ష్యసేన్ ఓటమి

image

బ్యాడ్మింటన్ మెన్స్ సెమీస్‌లో లక్ష్యసేన్‌కు నిరాశే ఎదురైంది. తొలి సెట్లో మొదట దూకుడుగా ఆడిన సేన్ గేమ్ పాయింట్ వద్ద తడబడ్డారు. దీంతో ప్రత్యర్థి అక్సెల్‌సేన్‌కు వరుస పాయింట్లు దక్కి ఆ సెట్‌ను (22-20) సొంతం చేసుకున్నారు. రెండో సెట్లో వరుసగా ఏడు పాయింట్లు సాధించి ఆధిపత్యం చెలాయించిన సేన్ ఆ తర్వాత పట్టు కోల్పోయారు. దీంతో 14-21 తేడాతో ఆ సెట్ కూడా కోల్పోయి, మ్యాచ్ చేజార్చుకున్నారు. <<-se>>#Olympics2024<<>>

Similar News

News January 21, 2025

యథావిధిగా కొనసాగనున్న ఆరోగ్య సేవలు

image

TG: నెట్ వర్క్ ఆస్పత్రులు ఆరోగ్య శ్రీ సేవలను నిలిపివేయడంతో మంత్రి రాజనర్సింహా ఆస్పత్రుల ప్రతినిధులతో చర్చలు జరిపారు. గత ఏడాది కాలంలో రూ.1,137కోట్లు చెల్లించామని, మరో 6 నెలల్లో బకాయిలన్నీ క్లియర్ చేస్తామని వారికి హామీ ఇచ్చారు. ఇతర సమస్యలపైనా కమిటీ ఏర్పాటు చేసి, సానుకూలంగా నిర్ణయం తీసుకుంటామన్నారు. దీంతో ఆరోగ్య శ్రీ సేవలను యథావిధిగా కొనసాగిస్తామని నెట్‌వర్క్ హాస్పిటల్స్ అసోసియేషన్ తెలిపింది.

News January 21, 2025

మహిళల ఖాతాల్లోకి డబ్బులు.. కీలక అప్‌డేట్

image

TG: ఈనెల 26 నుంచి ‘<<15192924>>ఇందిరమ్మ ఆత్మీయ భరోసా<<>>’ అమలు కానున్న విషయం తెలిసిందే. 2023-24లో ఉపాధి హామీ స్కీమ్‌లో కనీసం 20 పని దినాలు పూర్తి చేసిన వారికి కుటుంబం యూనిట్‌గా దీన్ని అమలు చేయనున్నారు. కుటుంబంలోని మహిళ బ్యాంకు ఖాతాలో డబ్బులు జమ కానున్నాయి. ఒకవేళ ఒకే ఇంట్లో అర్హులైన ఇద్దరు మహిళలుంటే వారిద్దరిలో పెద్ద వయస్కురాలి ఖాతాలో జమ చేస్తారు. అర్హులైన మహిళలు లేకుంటే కుటుంబ పెద్ద అకౌంట్‌లో నగదు వేస్తారు.

News January 21, 2025

క్షేమంగానే మావోయిస్టు నేత దామోదర్!

image

TG: ములుగు జిల్లా తాడ్వాయికి చెందిన మావోయిస్టు రాష్ట్ర కమిటీ కార్యదర్శి బడే చొక్కారావు అలియాస్ దామోదర్ సురక్షితంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఛత్తీస్‌గఢ్‌లో ఈ నెల 16న జరిగిన ఎన్‌కౌంటర్‌లో దామోదర్ చనిపోయినట్లు ఆ పార్టీ లేఖ విడుదల చేసింది. అయితే ఈ విషయాన్ని పోలీసులు ధ్రువీకరించలేదు. తాను క్షేమంగానే ఉన్నట్లు దామోదర్ కుటుంబీకులకు చేరవేసినట్లు సమాచారం. ఎన్‌కౌంటర్‌లో 16మంది మావోలు చనిపోయిన విషయం తెలిసిందే.