News August 2, 2024
ఈ నెలలో రీరిలీజ్‌లు ఎక్కువే!

ఈ నెలలో దాదాపు అర డజనుకుపైగా టాలీవుడ్ సినిమాలు రీరిలీజ్ అవుతున్నాయి. ఈ నెల 2న నాని నటించిన ‘ఎటో వెళ్లిపోయింది మనసు’, 9న మహేశ్ బాబు నటించిన ‘మురారి’, 8న ‘ఒక్కడు’, 22న చిరంజీవి ‘ఇంద్ర’, 28న నాగార్జున ‘మాస్’, 29న ‘శివ’ చిత్రాలు రీరిలీజ్ కానున్నాయి. మరికొన్ని సినిమాలు కూడా రీరిలీజ్ అవుతాయని తెలుస్తోంది. మరి మీరు ఏ సినిమాకు వెళ్తారో కామెంట్ చేయండి.
Similar News
News March 31, 2026
రేపటి నుంచి NTR వైద్యసేవలు బంద్!

AP: రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి ఎన్టీఆర్ వైద్య సేవ(ఆరోగ్యశ్రీ)లను నిలిపివేయనున్నట్లు నెట్‌వర్క్ ఆస్పత్రులు ప్రకటించాయి. రూ.3వేల కోట్ల పెండింగ్ బకాయిలను చెల్లించాలని యాజమాన్యాలు డిమాండ్ చేస్తున్నాయి. ప్రభుత్వం వెంటనే స్పందించాలని కోరుతున్నాయి.
News March 31, 2026
నా భర్తతో స్వేచ్ఛగా విభేదిస్తా: JD వాన్స్ సతీమణి ఉష

అన్ని విషయాల్లో తాను తన భర్తతో ఏకీభవించనని అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ సతీమణి ఉష తెలిపారు. ఆయన చుట్టూ ఎంత మంది అడ్వైజర్స్ ఉన్నా.. కొన్ని విషయాల్లో వాన్స్ తననే సంప్రదిస్తారని వెల్లడించారు. అలా అని ఆయన పనిలో మాత్రం తాను జోక్యం చేసుకోనని చెప్పారు. ఏదీ దాచుకోకుండా ఒకరి అభిప్రాయాలు ఒకరితో పంచుకుంటామని, స్వేచ్ఛగా విభేదించుకుంటామని తెలిపారు. ఇది ఇద్దరి ఎదుగుదలకు దోహదం చేస్తుందని పేర్కొన్నారు.
News March 31, 2026
ఇండిగో కొత్త సీఈవోగా విలియం వాల్ష్

భారత్‌లో అతిపెద్ద ఎయిర్‌లైన్స్ ఇండిగోకు కొత్త CEOగా విలియం వాల్ష్ నియమితులయ్యారు. ఈయన ప్రస్తుతం IATA(ఇంటర్నేషనల్ ఎయిర్ ట్రాన్స్‌పోర్ట్ అసోసియేషన్) డైరెక్టర్ జనరల్‌గా ఉన్నారు. గతంలో ఈయన బ్రిటిష్ ఎయిర్‌వేస్ తదితర సంస్థల్లో పనిచేశారు. విలియం నాయకత్వంలో ఎయిర్‌లైన్స్ మరింత అభివృద్ధి చెందుతుందని ఇండిగో ఛైర్మన్ విక్రమ్ సింగ్ అన్నారు. ఇటీవల ఇండిగో CEO పదవికి పీటర్ ఎల్బర్స్ రిజైన్ చేసిన విషయం తెలిసిందే.


