News June 4, 2024

హిందీ హార్ట్‌ల్యాండులో ‘రెక్కలు తెగిన కమలం’

image

లోక్‌సభలో బంపర్ మెజారిటీ రావాలంటే హిందీ హార్ట్‌ల్యాండే కీలకం. ఇక్కడ 225 సీట్లున్నాయి. గతంతో పోలిస్తే బీజేపీ ఇక్కడ బాగా డీలా పడింది. 2019లో 177 స్థానాల్లో గెలిచిన ఆ పార్టీ 2024లో 125కి తగ్గింది. అప్పుడు 6 సీట్లున్న కాంగ్రెస్ ఇప్పుడు 26కి పెరిగింది. ఎస్పీ సహా స్థానిక పార్టీలు 42 నుంచి 74కు పుంజుకున్నాయి. మొత్తంగా ఎన్డీయే 203 నుంచి 148కి పడిపోయింది. రాజస్థాన్, యూపీలోనే కమలానికి ఎదురుగాలి వీచింది.

Similar News

News November 30, 2024

ALERT.. తెలంగాణలో మూడు రోజులు వర్షాలు!

image

TG: బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంగల్ తుఫాను ప్రభావంతో రాష్ట్రంలో మూడు రోజుల పాటు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఇవాళ ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, KMM, నల్గొండ, సూర్యాపేట, WGL, మహబూబాబాద్, HNKలో వర్షం పడే ఛాన్స్ ఉంది. రేపు రాష్ట్ర వ్యాప్తంగా, ఎల్లుండి కరీంగనర్, PDPL, సిద్దిపేట, RR, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజిగిరితో పాటు ఉమ్మడి ఖమ్మం, నల్గొండలో మోస్తరు వర్షాలు కురవొచ్చని పేర్కొంది.

News November 30, 2024

ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదు: CM

image

AP: రాష్ట్రంలో రెవెన్యూ సేవలు సులభతరం కావాలని, ఆన్‌లైన్‌లో అన్ని సర్వీసులు అందుబాటులోకి రావాలని సీఎం చంద్రబాబు ఆదేశించారు. టెక్నాలజీ కాలంలో కూడా సర్టిఫికెట్ల కోసం ప్రజలు ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరిగే పరిస్థితి ఉండకూడదన్నారు. రెవెన్యూ రికార్డులు, భూకబ్జాలు, అసైన్మెంట్ భూముల సమస్యలపై ఎక్కువగా ఫిర్యాదులు వస్తున్నాయని, వీటికి సత్వర, పూర్తిస్థాయి పరిష్కారం చూపించాల్సిన అవసరం ఉందని తెలిపారు.

News November 30, 2024

త్వరలో పెట్రోల్, డీజిల్ వాహనాలకు లైఫ్ ట్యాక్స్ పెంపు?

image

TG: పెట్రోల్, డీజిల్ వాహనాలపై విధించే లైఫ్ ట్యాక్స్ కేరళ, తమిళనాడు, కర్ణాటకతో పోల్చితే తెలంగాణలోనే తక్కువగా ఉన్నట్లు రవాణా శాఖ ప్రభుత్వానికి నివేదిక ఇచ్చింది. దీని ఆధారంగా త్వరలోనే లైఫ్ ట్యాక్స్ పెంచాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు తెలుస్తోంది. క్యాబినెట్ భేటీలో చర్చించిన అనంతరం దీనిపై నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. ట్యాక్స్ పెంచితే ప్రభుత్వానికి రూ.2వేల కోట్ల అదనపు ఆదాయం వస్తుందని అంచనా.