News March 17, 2024

ప్రేమ విఫలమై యువకుడి బలవన్మరణం!

image

బల్మూరు: ప్రేమ విఫలమై యువకుడు బలవన్మరణానికి పాల్పడిన సంఘటన మండల కేంద్రంలో చోటు చేసుకుంది. ASI రేణయ్య తెలిపిన వివరాల ప్రకారం.. హరికృష్ణ(25) తాను ప్రేమించిన యువతికి పెళ్లి చేస్తున్నారని తీవ్ర మనస్తాపానికి గురై ఇంటి వద్ద ఎవరు లేని సమయంలో ఈ నెల 10న పురుగు మందు తాగాడు. HYDలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. తండ్రి లక్ష్మయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై తెలిపారు.

Similar News

News January 23, 2026

MBNR: MVSలో ఉద్యోగమేళా..164 మంది ఎంపిక

image

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలోని MVS ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గురువారం ఉద్యోగమేళా నిర్వహించారు. ఇందులో 164 మంది విద్యార్థులు 18 కంపెనీలలో ఉద్యోగ అర్హత సాధించారు. ఎంపికైన విద్యార్థులకు ఆఫర్ లెటర్స్ ను ప్రిన్సిపల్ డా.కె. పద్మావతి అందజేశారు. ఈ కార్యక్రమంలో ప్లేస్ మెంట్ కో ఆర్డినేటర్ సూర్యనారాయణ, అకాడమిక్ కో ఆర్డినేటర్ రవీందర్, టీఎస్ కేసీ మెంటర్ తేజస్విని, అధ్యాపకులు పాల్గొన్నారు.

News January 22, 2026

MBNR: సంక్రాంతి ఆదాయంలో ఆర్టీసీ రికార్డు.. రాష్ట్రంలోనే టాప్.!

image

సంక్రాంతి పండుగ వేళ MBNR ఆర్టీసీ రీజియన్ రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. 794 ప్రత్యేక బస్సులతో 39.20 లక్షల మంది ప్రయాణికులను సురక్షితంగా చేరవేసి ₹22.70 కోట్ల ఆదాయం సాధించినట్లు RM సంతోష్ కుమార్ తెలిపారు. 109% ఆక్యూపెన్సీ రేషియోతో తెలంగాణలోనే అగ్రస్థానంలో నిలిచి సరికొత్త రికార్డు సృష్టించామన్నారు. సుమారు 34.48 లక్షల కి.మీటర్లు బస్సులు నడిపి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చామన్నారు.

News January 22, 2026

పాలమూరు కార్పొరేటర్‌కు ఫుల్ డిమాండ్

image

పాలమూరు కార్పొరేషన్​లో కార్పొరేటర్​ స్థానాలకు తీవ్ర పోటీ నెలకొంది. ప్రతి డివిజన్​ నుంచి ఒక్కోపార్టీ తరఫున ఐదారుగురు లీడర్ల మధ్య పోటీ నెలకొంది. మరికొన్ని డివిజన్లలో 10 మందికిపై గానే టికెట్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. దీంతో ఆయా డివిజన్లలో క్యాండిడేట్ల ఎంపిక ప్రధాన పార్టీలకు పెద్ద సవాల్​గా మారింది. కాంగ్రెస్ 373 మంది, BJP నుంచి 250 మంది దరఖాస్తు చేసుకోగా, BRS నుంచి 446 మంది దరఖాస్తు చేసుకున్నారు.