News November 14, 2024

విశాఖలో ప్రేమోన్మాది ఘాతుకం

image

AP: విశాఖ జిల్లాలో ప్రేమోన్మాది ఘాతుకానికి పాల్పడ్డాడు. కొంతకాలంగా మేఘనకు నీరభ్ శర్మ అశ్లీల చిత్రాలు పంపడంతో పాటు ఫొటోలు మార్ఫింగ్ చేసి వేధిస్తుండేవాడు. ప్రేమను అంగీకరించట్లేదనే కోపంతో ఇవాళ పెదగంట్యాడ మండలం బాలచెరువు సమీపంలోని యువతి ఇంటికి వెళ్లి ఐరన్‌రాడ్డుతో దాడి చేశాడు. ఆమె తీవ్రంగా గాయపడగా ఆస్పత్రికి తరలించారు. ఘటన అనంతరం యువకుడు పరారయ్యాడు. ఘటనపై న్యూపోర్ట్ పోలీసులు విచారణ చేస్తున్నారు.

Similar News

News November 28, 2025

‘పిచ్చుకల పరిరక్షణలో విద్యార్థులను భాగస్వాములు చేయాలి’

image

కాకినాడ జిల్లాలోని ప్రతి విద్యార్థికి స్వయంగా ధాన్యం కుంచె తయారీ నేర్పించి, పిచ్చుకల పరిరక్షణ ఉద్యమంలో భాగస్వాములను చేయాలని తునికి చెందిన విశ్రాంత హిందీ ఉపాధ్యాయులు పి. దాలినాయుడు కోరారు. గురువారం ఆయన కాకినాడ కలెక్టరేట్‌లో కలెక్టర్ షాన్‌మోహన్ మర్యాదపూర్వకంగా కలిశారు. పిచ్చుకల పరిరక్షణకు తాను చేపట్టిన కార్యక్రమం వివరాలను ఆయన కలెక్టర్‌కు వివరించారు.

News November 28, 2025

టుడే టాప్ స్టోరీస్

image

*రాజధాని రైతులకు న్యాయం చేయడం నా బాధ్యత: CM CBN
*దిత్వా తుఫానుతో రానున్న మూడ్రోజులు కోస్తా, సీమలో భారీ వర్షాలు
*TGలో తొలి విడత సర్పంచ్ ఎన్నికలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభం
*TG: 2015 గ్రూప్-2 ర్యాంకర్ల నియామకాలు రద్దు చేయాలన్న సింగిల్ బెంచ్ తీర్పును రద్దు చేసిన HC డివిజన్ బెంచ్
*ఆధార్‌తో ఓటు హక్కు, పౌరసత్వం కుదరదు: సుప్రీంకోర్టు
*వచ్చే ఏడాది జనవరి 9 నుంచి ఫిబ్రవరి 5 వరకు మహిళల ప్రీమియర్ లీగ్