News May 4, 2024

నా జీవితంలో ప్రేమది కీలకపాత్ర: శోభిత

image

ప్రేమపై నటి శోభితా దూళిపాళ్ల ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో ప్రేమ కీలక పాత్ర పోషిస్తుందన్నారు. తాను ఎక్కువగా పక్కవారిపై ఆధారపడతానని చెప్పారు. చిన్న చిన్న ఆనందాలకే పొంగిపోతానని.. సినిమాలో క్యారెక్టర్స్‌లాగా తాను స్ట్రాంగ్ కాదని చెప్పారు. కాగా ఇటీవల విడుదలైన ‘మంకీ మ్యాన్’ చిత్రంలో ఆమె నటనకు ప్రశంసలు వెల్లువెత్తాయి.

Similar News

News December 28, 2024

రోహిత్ ఓ విఫల కెప్టెన్, బ్యాటర్: MSK ప్రసాద్

image

టీమ్ ఇండియా కెప్టెన్ ఆస్ట్రేలియా పర్యటనలో పూర్తిగా నిరాశపరుస్తున్నారని బీసీసీఐ మాజీ చీఫ్ సెలక్టర్ ఎమ్మెస్కే ప్రసాద్ విమర్శించారు. ఇటు బ్యాటింగ్, అటు కెప్టెన్సీలో పూర్తిగా విఫలమయ్యారని ఆయన ఆరోపించారు. ‘రోహిత్ ఆడిన మూడు టెస్టుల్లోనూ పరుగులు రాబట్టలేకపోయారు. ఫామ్‌ లేమితో ఆయన సతమతమవుతున్నారు. మరోవైపు కెప్టెన్సీలోనూ బౌలర్లను ఉపయోగించడంలో అంతగా ఆకట్టుకోవడం లేదు’ అని ఆయన విమర్శించారు.

News December 28, 2024

అయోధ్యలో New Year జోష్.. హోటళ్లన్నీ ఫుల్

image

అయోధ్య పర్యాటక శోభను సంతరించుకోనుంది. ఈ పది రోజుల్లో బాలరాముడిని లక్షలాది భక్తులు దర్శించుకుంటారని అంచనా. 2024 ముగింపు, 2025 ఆరంభాన్ని ఈ దివ్యధామంలో జరుపుకొనేందుకు చాలామంది ఉవ్విళ్లూరుతున్నారు. JAN 15 వరకు అయోధ్య, ఫైజాబాద్‌లో హోటళ్లన్నీ బుక్కయ్యాయి. డిమాండును బట్టి ఒక రాత్రికి రూ.10వేల వరకు ఛార్జ్ చేస్తున్నారు. టెంటులోని రామయ్య భవ్య మందిరంలో అడుగుపెట్టాక వచ్చిన తొలి CY 2025 కావడం విశేషం.

News December 28, 2024

షాకింగ్: బేబీ బంప్‌తో సమంత.. నిజమిదే!

image

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(AI)ను కొందరు దుర్వినియోగం చేస్తున్నారు. టెక్నాలజీ చేతిలో ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు వ్యవహరిస్తున్నారు. తాజాగా హీరోయిన్ సమంత బేబీ బంప్‌తో ఉన్నట్లు ఫొటోలు క్రియేట్ చేసి సోషల్ మీడియాలో వదిలారు. తొలుత ఇవి చూసి ఆమె ఫ్యాన్స్ షాక్ అయ్యారు. క్షుణ్ణంగా పరిశీలిస్తే AI ఇమేజెస్ అని తేలాయి. దీంతో వీటిని తయారుచేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.