News October 3, 2024
లవ్ జిహాద్ జాతి ఐక్యతకు బిగ్ థ్రెట్: UP కోర్టు

భారత్‌పై ఓ వర్గపు యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఆధిపత్యమే ‘లవ్ జిహాద్’ లక్ష్యమని UPలోని ఓ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు పేర్కొంది. దీనిని ప్రేమ పేరుతో అక్రమంగా మతం మార్చడం, పాక్, బంగ్లా పరిస్థితుల్ని కల్పించేందుకు జరుగుతున్న అంతర్జాతీయ కుట్రగా వర్ణించింది. జదావున్పూర్లో Md అలీమ్ తన ఐడెంటిటీ దాచి ఆనంద్ పేరుతో ఓ స్టూడెంట్ను రేప్ చేసి చంపేస్తానని బెదిరించాడు. కోర్టు అతడికి జీవితఖైదు విధిస్తూ ఈ వ్యాఖ్యలు చేసింది.
Similar News
News November 16, 2025
SIR నిర్వహణకు సిద్ధం కండి: సీఈవో

TG: బిహార్ తరహాలో రాష్ట్రంలోనూ త్వరలో ఓటర్ల జాబితా సవరణను కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టనుందని సీఈవో సుదర్శన్ రెడ్డి తెలిపారు. అందుకు సంబంధించిన సన్నాహాలు త్వరగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఈఆర్వోలు, ఏఆర్వోలతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఓటర్ల జాబితాలో మార్పులు, దరఖాస్తులు, అభ్యంతరాల స్వీకరణ, పరిష్కారంపై దృష్టి సారించాలని సూచించారు. SIR నిర్వహణకు పూర్తి సంసిద్ధతతో ఉండాలన్నారు.
News November 16, 2025
మూడో రోజే ముగిస్తారా?

ఇండియా, సౌతాఫ్రికా మధ్య జరుగుతున్న తొలి టెస్టు మూడో రోజే ముగిసేలా ఉంది. తొలి ఇన్నింగ్స్‌లో రెండు జట్లు 200 లోపు స్కోర్లకే ఆలౌట్ అయ్యాయి. రెండో ఇన్నింగ్స్‌లోనూ తడబడిన సౌతాఫ్రికా 93 పరుగులకు 7 వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడింది. ప్రస్తుతం కేవలం 63 పరుగుల లీడ్‌లో ఉంది. భారత్ కట్టుదిట్టంగా బౌలింగ్ చేస్తుండటంతో మిగతా 3 వికెట్లు ఫస్ట్ సెషన్లోనే పడిపోయే ఛాన్స్ ఉంది.
News November 16, 2025
కార్తీక మాసంలో ఇవి ఆచరించలేదా?

కార్తీక మాసంలో దీపారాధన, దీపదానం చేస్తారు. అయితే తులసి చుట్టూ ప్రదక్షిణలు, ఉసిరి చెట్టు పూజ, దాని కింద వనభోజనం, శివుడితో పాటు కేశవుడి కథలు కూడా వినడం, దానధర్మాల్లో పాల్గొనడం.. వంటివి కూడా చేయాలని పండితులు చెబుతున్నారు. ఇప్పటి వరకు ఇవి చేయకపోతే.. రేపు కార్తీక మాస చివరి సోమవారం రోజున ఆచరించవచ్చని సూచిస్తున్నారు. ఫలితంగా శివకేశవుల సంపూర్ణ అనుగ్రహంతో సకల పాపాలు తొలగి, శుభాలు కలుగుతాయని నమ్మకం.


