News July 10, 2025
ప్రేమ పెళ్లి.. వరుడికి 79, వధువుకు 75 ఏళ్లు

ప్రేమకు వయసుతో సంబంధం లేదని కేరళకు చెందిన ఓ వృద్ధ జంట నిరూపించింది. రామవర్మపురంలోని ప్రభుత్వ వృద్ధాశ్రమంలో 79 ఏళ్ల విజయ రాఘవన్, 75 ఏళ్ల సులోచన మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. దీంతో పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. తాజాగా స్పెషల్ మ్యారేజ్ యాక్ట్ కింద ఒక్కటయ్యారు. వీరి వివాహానికి ఆ రాష్ట్ర మంత్రి ఆర్.బిందు, సిటీ మేయర్ వర్గీస్, అధికారులు హాజరయ్యారు.
Similar News
News July 11, 2025
ప్రభుత్వ స్కూళ్లలో పెరిగిన అడ్మిషన్లు

TG: ప్రభుత్వ పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరంలో 3.68 లక్షల మంది విద్యార్థులు చేరారు. వీరిలో ఒకటో తరగతిలో 1,38,153 మంది, రెండు నుంచి పదో తరగతి వరకు 2,29,919 మంది అడ్మిషన్లు తీసుకున్నారు. గత ఏడాది ఇదే సమయానికి 2.9 లక్షల మంది చేరగా ఈ సారి సంఖ్య పెరిగింది. జిల్లాల వారీగా రంగారెడ్డి(36,325)లో అత్యధికంగా విద్యార్థులు చేరారు. ఆగస్టు నెలాఖరు వరకు అడ్మిషన్లు కొనసాగుతాయని అధికారులు తెలిపారు.
News July 11, 2025
EP-4: ఈ 3 విషయాలు మీ పిల్లలను హీరోలను చేస్తాయి: చాణక్య నీతి

పిల్లలు ప్రయోజకులు అవ్వాలంటే వారికి ఈ 3 విషయాలు చిన్నప్పటి నుంచే నేర్పించాలని చాణక్యుడు తెలిపారు. పిల్లలు సత్యమార్గం అనుసరించేలా చేయాలి. అబద్ధాలతో కలిగే అనర్థాలను వివరించాలి. పిల్లలకు క్రమశిక్షణ నేర్పించాలి. అదే వారిని ఉన్నత శిఖరాలు అధిరోహించేలా చేస్తుంది. చిన్నప్పటి నుంచే వారికి విలువలు నేర్పాలి. పెద్దలను గౌరవించడం, తోటి వారితో మానవత్వంతో మెలగడం వంటివి నేర్పించాలి.
<<-se>>#Chanakyaneeti<<>>
News July 11, 2025
డేటా అవసరం లేని వారికోసం Airtel కొత్త ప్లాన్

ఎయిర్‌టెల్ సంస్థ కస్టమర్స్ కోసం కొత్తగా రూ.189 ప్లాన్ తీసుకొచ్చినట్లు ప్రకటించింది. డేటా కోసం కాకుండా నంబరును యాక్టివ్‌గా ఉంచాలనుకునే వారికి, ఇంటర్నెట్ పెద్దగా వాడని పేరెంట్స్‌కి ఈ ప్లాన్ యూజ్ అవుతుంది. ఈ ప్లాన్ 21 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అన్ని నెట్వర్కులకు అపరిమిత వాయిస్ కాల్స్, 1GB మొబైల్ డేటా, 300 SMSలు వస్తాయి. అయితే ఇది డేటా ఎక్కువగా వాడే వారికి అంత ఉపయోగంగా ఉండదు.