News November 30, 2024

ఇన్‌స్టాగ్రామ్‌లో ప్రేమ.. చివరికి విషాదాంతం

image

ఆన్‌లైన్ ప్రేమకు మరో యువతి బలైంది. విజయవాడకు చెందిన ఓ యువతి ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమైన వ్యక్తితో ప్రేమలో పడింది. అతడినే పెళ్లి చేసుకోవాలనుకోగా పేరెంట్స్ నిరాకరించారు. దీంతో ఆమె ఎలుకల మందు తాగింది. కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలించి ప్రాణాలు కాపాడారు. తర్వాత ఆమె ఇంట్లో నుంచి వెళ్లిపోగా తిరిగి తీసుకొచ్చారు. మరోసారి వెళ్లిపోయి ఏలూరు కాలువలో దూకింది. తాజాగా ఆమె శవాన్ని పోలీసులు గుర్తించారు.

Similar News

News March 25, 2026

శాంతి చర్చలపై ట్రంప్‌కు ఇరాన్ షరతులు!

image

శాంతి చర్చలపై <<19470089>>ట్రంప్<<>> పెట్టిన షరతులకు కౌంటర్‌గా ఇరాన్ కూడా కండిషన్స్ పెట్టినట్లు సమాచారం. గల్ఫ్‌లోని US బేస్‌లు మూసివేయాలని, నష్టపరిహారం ఇవ్వాలని, ఈజిప్ట్ సూయజ్ కెనాల్ తరహాలోనే హార్ముజ్‌లో షిప్పుల రాకపోకలపై ఫీజు వసూలు చేసుకుంటామని, అన్ని ఆంక్షలను తొలగించాలని డిమాండ్ చేసింది. దీంతో పాటు మిస్సైల్ ప్రోగ్రామ్‌ ఆంక్షలు పెట్టొద్దని, హెజ్బొల్లాపై ఇజ్రాయెల్ దాడులు ఆపాలని స్పష్టం చేసినట్లు తెలుస్తోంది.

News March 25, 2026

లాభాల్లో స్టాక్ మార్కెట్లు

image

దేశీయ స్టాక్ మార్కెట్లు వరుసగా రెండో రోజు లాభాల్లో ట్రేడ్ అవుతున్నాయి. సెన్సెక్స్ 1122 పాయింట్లు లాభ పడి 75,190కు చేరగా నిఫ్టీ 316 పాయింట్ల లాభంతో 23,272 వద్ద ట్రేడవుతోంది. సెన్సెక్స్ టాప్ 30 ఇండెక్స్‌లో ట్రెంట్, అదానీ పోర్ట్స్, బజాజ్ ఫైనాన్స్ సహా 12కుపైగా స్టాక్స్ 2%పైగా లాభాల్లో ఉన్నాయి. క్రూడ్ ధరలు తగ్గుతుండటం, యుద్ధంపై శాంతి చర్చలకు ప్రయత్నాలు జరగడం ఇందుకు ప్రధాన కారణాలు.

News March 25, 2026

BREAKING: భారీగా పెరిగిన బంగారం, వెండి ధరలు

image

హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో ఇవాళ బంగారం, వెండి ధరలు భారీగా పెరిగాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.3,760 పెరిగి రూ.1,46,670కు చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు రూ.3,450 ఎగబాకి రూ.1,34,450 పలుకుతోంది. అటు కేజీ సిల్వర్ రేటు రూ.10వేలు పెరిగి రూ.2,60,000గా ఉంది.