News July 25, 2024
ట్యూషన్ టీచర్తో ప్రేమ.. ఆన్లైన్ ఆర్డర్లతో వేధింపులు!

చెన్నైలో ట్యూషన్ టీచర్(22)తో ప్రేమలో పడ్డాడు ఓ మైనరు(17). ఇటీవల ఆమె అతణ్ని దూరం పెట్టడంతో పగ పెంచుకుని వినూత్న రీతిలో వేధించడం మొదలుపెట్టాడు. ఆమె ఇంటికి వందలాది క్యాష్ ఆన్ డెలివరీ ఆర్డర్లు, ఓలా, ఉబర్ రైడ్స్ బుక్ చేశాడు. వచ్చిన వారికి సమాధానం చెప్పుకోలేక యువతి కుటుంబం ఉక్కిరిబిక్కిరైంది. దీనిపై వారు పోలీసులను ఆశ్రయించగా నిందితుడ్ని పట్టుకున్నారు. అతనికి కౌన్సెలింగ్ ఇవ్వాలని కోర్టు ఆదేశించింది.
Similar News
News November 15, 2025
మరో కీలక మావో లొంగుబాటు?

మావోయిస్టు అగ్రనేతల లొంగుబాటు కొనసాగుతోంది. తెలంగాణ రాష్ట్ర కమిటీ సభ్యుడు కొయ్యాడ సాంబయ్య అలియాస్ ఆజాద్, మరో నేత అప్పాసి నారాయణ తమ కేడర్తో సరెండర్ కానున్నట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం తెలంగాణకు చెందిన 64 మంది మాత్రమే అజ్ఞాతంలో ఉన్నారు. త్వరలో జరగబోయే లొంగుబాటుతో చాలామంది జనజీవన స్రవంతిలో కలిసే అవకాశముంది. ఇప్పటికే మావో టాప్ కమాండర్లు మల్లోజుల, తక్కళ్లపల్లి లొంగిపోయిన విషయం తెలిసిందే.
News November 15, 2025
జీఎస్టీ సంస్కరణలతో బీమా రంగం వృద్ధి: IRDAI

GST సంస్కరణలు అమలులోకి వచ్చిన తర్వాత బీమా రంగంలో వృద్ధి కనిపిస్తోందని IRDAI మెంబర్ దీపక్ సూద్ తెలిపారు. కేంద్ర ప్రభుత్వ బీమాను నిత్యవసర వస్తువుగా చూస్తోందన్నారు. బీమా పాలసీలపై జీఎస్టీని జీరో శాతానికి తీసుకురావడం ఇన్సూరెన్స్ రంగానికి కలిసొచ్చిందని చెప్పారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా వస్తున్న నష్టాల నుంచి బయటపడేందుకు ప్రత్యేక పాలసీలు రూపొందించాలని, జీఎస్టీ ప్రయోజనాలు ప్రజలకు అందించాలని సూచించారు.
News November 15, 2025
స్త్రీలు గాజులు ఎందుకు ధరించాలి?

స్త్రీలు గాజులు ధరించడం సాంప్రదాయమే కాదు. శాస్త్రీయంగా ప్రయోజనాలు కూడా ఉన్నాయి. గాజులు మణికట్టుపై నిరంతరం రాపిడి కలిగిస్తాయి. దీంతో ఆ ప్రాంతంలో రక్త ప్రసరణ స్థాయి పెరుగుతుంది. గాజుల గుండ్రటి ఆకారం శక్తిని శరీరం నుంచి వెళ్లకుండా అడ్డుకుని, తిరిగి మనకే పంపుతుంది. ముఖ్యంగా స్త్రీలకు మణికట్టు వద్ద శక్తిని నిలిపి ఉంచడానికి గాజులు రక్షా కవచంగా పనిచేస్తాయి. ఇది శారీరక సమతుల్యతను కాపాడుతుంది.


