News April 2, 2025
ప్రేమోన్మాది ఘాతుకం.. తల్లీకూతుళ్లపై దాడి

AP: విశాఖపట్నం కొమ్మాది స్వయంకృషినగర్‌లో ఓ ప్రేమోన్మాది దారుణానికి పాల్పడ్డాడు. దీపిక అనే యువతితో పాటు ఆమె తల్లిపై కత్తితో దాడి చేశాడు. ఈ దాడిలో తల్లి నక్కా లక్ష్మి(43) మృతిచెందగా, తీవ్ర గాయాలపాలైన దీపికను స్థానికులు ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. దాడి చేసిన యువకుడిని నవీన్‌గా గుర్తించారు. ప్రస్తుతం అతడు పరారీలో ఉన్నాడు.
Similar News
News February 7, 2026
అన్ని US పారిశ్రామిక వస్తువులపై భారత్ జీరో డ్యూటీ: పీయూష్ గోయల్

అమెరికాతో ట్రేడ్ డీల్‌పై ఏడాదిపాటు చర్చలు జరిపినట్లు కేంద్ర వాణిజ్య మంత్రి పీయూష్ గోయల్ వెల్లడించారు. భారత జెమ్స్ అండ్ జువెలరీపై జీరో టారిఫ్స్ వర్తిస్తాయని తెలిపారు. ఏడాదికి $500 బిలియన్ల వాణిజ్యం టార్గెట్ అని పేర్కొన్నారు. భవిష్యత్తులో సుంకాలను మరింత తగ్గించే విషయంపై చర్చిస్తున్నామన్నారు. USకు చెందిన అన్ని పారిశ్రామిక వస్తువులపై భారత్ సున్నా సుంకాలు విధిస్తుందని వెల్లడించారు.
News February 7, 2026
పసికూనపై అతికష్టం మీద గెలిచిన పాకిస్థాన్

టీ20 ప్రపంచకప్‌లో భాగంగా నెదర్లాండ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో పాక్ అతి కష్టం మీద గెలిచింది. నెదర్లాండ్స్ నిర్దేశించిన 148 పరుగుల లక్ష్యాన్ని 7 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఫర్హాన్(47), అయూబ్(24) రాణించారు. చివర్లో ఫహీమ్ అష్రఫ్(29*) ధనాధన్ ఇన్నింగ్స్‌తో గెలిపించారు. 19వ ఓవర్లో 24 రన్స్ రావడంతో సమీకరణాలు మారిపోయాయి. పాక్ తర్వాతి మ్యాచ్ ఈ నెల 10న USAతో ఆడనుంది.
News February 7, 2026
పంచాయతీ ఎన్నికలకు రెడీ అవుతున్న AP SEC

AP: పంచాయతీ ఎన్నికల నిర్వహణ కోసం ప్రాథమిక ఏర్పాట్లపై రాష్ట్ర ఎన్నికల సంఘం దృష్టి సారించింది. పంచాయతీ వార్డుల వారీగా ఫొటో ఓటర్ ఐడీ కార్డుల జాబితా సిద్ధం చేయాలని అన్ని జిల్లాల పంచాయతీ అధికారులను ఆదేశించింది. 2026 జనవరి 1వ తేదీని కటాఫ్‌గా చేసుకొని అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా వీటిని రూపొందించాలని సూచించింది. మార్చి 9న వీటిని పబ్లిష్ చేయనున్నట్లు ఆ ఆదేశాల్లో పేర్కొంది.


