News November 10, 2024

దూసుకొస్తున్న అల్పపీడనం.. రేపటి నుంచి భారీ వర్షాలు

image

AP: నైరుతి బంగాళాఖాతంలో రేపు అల్పపీడనం ఏర్పడే అవకాశముందని IMD వెల్లడించింది. ఇది రెండు రోజుల్లో తమిళనాడు/శ్రీలంక తీరాల వైపు కదులుతుందని తెలిపింది. దీని ప్రభావంతో రేపటి నుంచి 13వ తేదీ వరకు రాయలసీమ, దక్షిణ కోస్తా జిల్లాల్లో కొన్ని చోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. మత్స్యకారులు సముద్రంలో వేటకు వెళ్లరాదని హెచ్చరించింది. వ్యవసాయ పనుల్లో రైతులు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది.

Similar News

News March 21, 2026

ఇవాళ సెలవు

image

రంజాన్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. తొలుత జారీ చేసిన హాలిడేస్ లిస్ట్‌లో సెలవు నిన్న ఉండగా నెలవంక దర్శనం ఆధారంగా పండుగ శనివారం జరుపుకోవాలని ముస్లిం మతపెద్దలు నిర్ణయించారు. దీంతో ప్రభుత్వాలు నేడు సెలవు దినంగా ప్రకటించాయి. ఈ కారణంగా ఏపీలో ఇవాళ జరగాల్సిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షను ఏప్రిల్ 2కు వాయిదా వేశారు.

News March 21, 2026

రాష్ట్రానికి కమర్షియల్ గ్యాస్ కోటా పెరిగింది: నాదెండ్ల

image

AP: రాష్ట్రానికి కమర్షియల్ గ్యాస్ కోటా పెరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 4,500 మెట్రిక్ టన్నుల కోటాను 5,200 మెట్రిక్ టన్నులకు కేంద్రం పెంచిందని వెల్లడించారు. పాఠశాలలు, కాలేజీలకు వేసవి సెలవులు వస్తుండటంతో అక్కడికి పంపే సిలిండర్లను హోటళ్లకు ఇస్తామని హోటల్స్ జేఏసీ బృందానికి హామీ ఇచ్చారు. మరోవైపు త్వరలోనే కిరోసిన్‌‌ను ప్రజలకు సరఫరా చేస్తామని పేర్కొన్నారు.

News March 21, 2026

ముస్లింల వస్తువులు వద్దన్నారు.. క్రూడాయిల్ ఎందుకు కొంటున్నారు: అసద్

image

TG: దేశంలోని పలు రాష్ట్రాల్లో ముస్లింలు తయారుచేసే వస్తువులు కొనవద్దని తీర్మానం చేసిన బీజేపీ అరబ్ దేశాల నుంచి క్రూడాయిల్ ఎందుకు కొనుగోలు చేస్తోందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లి భారత్‌లో అన్ని వర్గాల కోసం పని చేస్తున్నామని చెప్తుండటం పచ్చి అబద్ధమన్నారు. దేశంలో గ్యాస్, పెట్రోలియం కొరత ఉన్నా అలాంటిదేం లేదని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.