News September 4, 2024
అల్పపీడనం.. అతి భారీ వర్షాలు

తెలుగు రాష్ట్రాలకు మరో ముప్పు పొంచి ఉన్నట్లు తెలుస్తోంది. బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని, దీని ప్రభావంతో మరోసారి భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ నిపుణులు అంచనా వేస్తున్నారు. ఏపీలోని గోదావరి జిల్లాలతో పాటు విజయవాడలో భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. అటు తూర్పు, ఉత్తర తెలంగాణలోనూ భారీ నుంచి అతిభారీ వర్షాలు కురుస్తాయన్నారు. కాగా ఇప్పటికే పలు జిల్లాల్లో వర్షాలు ప్రారంభమయ్యాయి.
Similar News
News January 11, 2026
రాబోయే 3 రోజులు గజగజ

TG: రాష్ట్రంలో రాత్రి నుంచి ఉదయం వరకు చలి వణికిస్తోంది. పొగమంచు, చలి గాలుల తీవ్రతతో వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. రాబోయే 3 రోజులు చలి మరింత పెరుగుతుందని, కనిష్ఠ ఉష్ణోగ్రతలు సాధారణం కంటే 2-3 డిగ్రీలు తక్కువగా నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది. మరోవైపు ఈ నెల చివరి వారంలో ఉత్తర, మధ్య తెలంగాణ, తూర్పు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు పడతాయని వాతావరణ నిపుణులు చెబుతున్నారు.
News January 11, 2026
రవితేజ నెక్ట్స్ సినిమా ఈ డైరెక్టర్‌తోనే!

మాస్ మహారాజా రవితేజ తన నెక్ట్స్ సినిమా డైరెక్టర్‌ను అనౌన్స్ చేశారు. నిన్ను కోరి, మజిలీ వంటి హిట్ మూవీలు తీసిన శివ నిర్వాణతో కలిసి పని చేయనున్నట్లు తెలిపారు. ఇటీవల థ్రిల్లర్ జోనర్‌లో ఆయన కథ వినిపించగా రవితేజకు నచ్చి ఓకే చేసినట్లు సమాచారం. త్వరలోనే మూవీపై అధికారిక ప్రకటన రానుందని టీటౌన్ వర్గాలు చెబుతున్నాయి. అటు రవితేజ నటించిన ‘భర్త మహాశయులకు విజ్ఞప్తి’ ఈనెల 13న రిలీజ్ అవుతున్న విషయం తెలిసిందే.
News January 11, 2026
యూజర్లకు షాక్.. పెరగనున్న మొబైల్ రీఛార్జ్ ధరలు!

రెండేళ్ల గ్యాప్ తర్వాత 2026 జూన్ నుంచి టెలికం కంపెనీలు రీఛార్జ్‌ల ధరలు పెంచే ఛాన్స్ ఉంది. 15% నుంచి 20% వరకు పెరగొచ్చని జెఫరీస్, మోర్గాన్ స్టాన్లీ వంటి సంస్థలు అంచనా వేశాయి. ప్రీపెయిడ్, పోస్ట్‌పెయిడ్ యూజర్లపై ఈ ప్రభావం ఉంటుంది. ఇప్పటికే కొన్ని కంపెనీలు తక్కువ ధర ప్లాన్స్ తీసేసి OTT బెనిఫిట్స్, హై-ఎండ్ ప్లాన్స్‌ను మారుస్తున్నాయి. ఆదాయం (ARPU) పెంచుకోవడమే లక్ష్యంగా ఈ మార్పులు చేస్తున్నాయి.


