News September 25, 2024

అల్పపీడనం.. భారీ వర్షాలు

image

AP: బంగాళాఖాతాన్ని ఆనుకుని అల్పపీడనం కొనసాగుతుందని వాతావరణశాఖ పేర్కొంది. దీని ప్రభావంతో రాగల 24 గంటల్లో కోస్తాంధ్రలో ఒకట్రెండు చోట్ల భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కాగా నిన్నటి నుంచి APలో పలుచోట్ల వర్షాలు దంచికొట్టాయి. అనకాపల్లి జిల్లాల్లో 13 CM వర్షపాతం నమోదైంది. అటు తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్, కరీంనగర్, NZB, MBNR, HYD, నల్గొండ జిల్లాల్లో కాసేపట్లో వర్షాలు పడే అవకాశం ఉందని తెలిపింది.

Similar News

News November 1, 2025

ఆమెకు మతం మారే ఆలోచన లేదు: జేడీ వాన్స్

image

హిందువైన తన భార్య ఉష <<18155411>>క్రైస్తవంలోకి మారే <<>>ఛాన్స్ ఉందంటూ అమెరికా ఉపాధ్యక్షుడు JD వాన్స్ చేసిన వ్యాఖ్యలు తీవ్ర విమర్శలకు దారితీశాయి. దీంతో ఆయన క్లారిటీ ఇస్తూ ట్వీట్ చేశారు. తన భార్య క్రిస్టియన్ కాదని, మతం మారే ఆలోచన కూడా ఆమెకు లేదని చెప్పారు. అయితే ఏదో ఒకరోజు తాను చూసినట్లే తన భార్య చూస్తుందని భావిస్తున్నానని తెలిపారు. సువార్త నిజమని, అందరికీ మంచిదని క్రైస్తవం చెబుతుందని అన్నారు.

News November 1, 2025

అమెరికాలో ఉగ్రదాడులకు కుట్ర.. భగ్నం చేసిన ఎఫ్‌బీఐ

image

అమెరికాలో ఉగ్ర దాడుల కుట్రను భగ్నం చేసినట్లు FBI డైరెక్టర్ కాశ్ పటేల్ తెలిపారు. మిషిగన్‌లో హాలోవీన్ వీకెండ్‌లో హింసాత్మక దాడులకు ప్లాన్ చేసిన పలువురిని అరెస్టు చేసినట్లు ట్వీట్ చేశారు. పూర్తి వివరాలను త్వరలోనే వెల్లడిస్తామని పేర్కొన్నారు. FBI ఏజెంట్లు, అధికారులు దేశాన్ని రక్షిస్తున్నారని అభినందించారు. అంతకుముందు మిషిగన్‌లో FBI సెర్చ్ ఆపరేషన్స్ నిర్వహించినట్లు డియర్‌బర్న్ పోలీసులు వెల్లడించారు.

News October 31, 2025

షెఫర్డ్ హ్యాట్రిక్.. బంగ్లాతో సిరీస్ క్లీన్‌స్వీప్

image

బంగ్లాదేశ్‌తో జరిగిన మూడో T20లో విండీస్ ఆల్‌రౌండర్ రొమారియో షెఫర్డ్ హ్యాట్రిక్ వికెట్లు తీశారు. వరుస బంతుల్లో నురుల్, తంజీద్, షొరిఫుల్‌లను ఔట్ చేశారు. తద్వారా ఈ ఫార్మాట్‌లో హ్యాట్రిక్ తీసిన రెండో WI ఆటగాడిగా నిలిచారు. గతంలో హోల్డర్ ENGపై 3 బంతుల్లో 3 వికెట్లు తీశారు. ఈ మ్యాచ్‌లో బంగ్లా 151 పరుగులకే ఆలౌటవగా 16.5 ఓవర్లలో విండీస్ లక్ష్యాన్ని చేధించింది. దీంతో 3-0తో సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేసింది.