News August 8, 2025
అల్పపీడనం.. భారీ వర్షాలు

AP: పశ్చిమ, మధ్య బంగాళాఖాతంలో ఈనెల 13 నాటికి అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని APSDMA తెలిపింది. ప్రస్తుతం దక్షిణ కోస్తా నుంచి ఉత్తర శ్రీలంక వరకు తమిళనాడు మీదుగా ద్రోణి కొనసాగుతోందని చెప్పింది. దీని ప్రభావంతో రేపు ప్రకాశం, నెల్లూరు, కర్నూలు, నంద్యాల, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. మిగతా జిల్లాల్లో మోస్తరు వానలు పడొచ్చని వెల్లడించింది.
Similar News
News August 9, 2025
SSC CGL పరీక్షలు వాయిదా

ఆగస్టు 13-30 వరకు జరగాల్సిన కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవల్(CGL) పరీక్షలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ వాయిదా వేసింది. ఫేజ్-13లో సాంకేతిక సమస్యలు తలెత్తడంతో పరీక్షలు వాయిదా వేస్తున్నట్లు SSC ప్రకటించింది. సెప్టెంబర్ మొదటి వారం నుంచి పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించింది. ఆ తేదీలు త్వరలోనే ప్రకటిస్తామని పేర్కొంది. 14,582 గ్రూప్ B, C పోస్టులకు గతంలో SSC నోటిఫికేషన్ ఇచ్చిన విషయం తెలిసిందే.
News August 8, 2025
ఏపీ న్యూస్ రౌండప్

* అల్లూరి జిల్లాలో స్కూళ్ల అభివృద్ధికి రూ.45.02కోట్లు మంజూరు చేసిన ప్రభుత్వం
* శ్రీశైలం జలాశయానికి క్రమంగా పెరుగుతున్న వరద. ఇన్ ఫ్లో 83,242, అవుట్ ఫ్లో 98,676 క్యూసెక్కులు
* జైలు నుంచి విడుదలైన వైసీపీ నేత తురకా కిశోర్
* స్వచ్ఛత పక్వాడా అవార్డులు-2024లో దేశంలోనే ఫస్ట్ ప్లేస్ దక్కించుకున్న విశాఖ పోర్ట్
* పులివెందుల జడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలింగ్ శాతం తగ్గించాలని TDP కుట్ర: ఎంపీ అవినాశ్ రెడ్డి
News August 8, 2025
బ్యాటర్ల ఊచకోత.. ముగ్గురు 150+ స్కోర్లు

రెండో టెస్టులో పసికూన జింబాబ్వేపై న్యూజిలాండ్ విరుచుకుపడుతోంది. తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా ముగ్గురు బ్యాటర్లు 150కి పైగా పరుగులు చేశారు. కాన్వే 153 రన్స్ చేసి ఔట్ అవ్వగా హెన్రీ నికోల్స్ 150, రచిన్ రవీంద్ర 165 పరుగులతో క్రీజులో ఉన్నారు. యంగ్(74), డఫీ(36) పర్వాలేదనిపించారు. దీంతో రెండో రోజు ఆట ముగిసే సమయానికి NZ 601/3 పరుగుల భారీ స్కోర్ చేసింది. తొలి ఇన్నింగ్స్‌లో జింబాబ్వే 125 రన్స్‌కు ఆలౌటైంది.