News July 15, 2024
అల్పపీడనం.. ఏపీలో భారీ వర్షాలు!

AP: ఈ నెల 19న బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు తెలిపారు. ఒడిశా తీరానికి సమీపంలో ఏర్పడే ఈ అల్పపీడనం వల్ల వచ్చే 5 రోజుల్లో కోస్తా జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని అంచనా వేశారు. రాయలసీమలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపారు. మరోవైపు వచ్చే 24 గంటల్లో మన్యం, అల్లూరి జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు పడే అవకాశం ఉందన్నారు.
Similar News
News January 31, 2026
పళ్లు పుచ్చిపోయాయా.. కొత్త జెల్ వచ్చేస్తోంది!

పంటి ఎనామిల్‌ను తిరిగి పెంచే కొత్త ప్రొటీన్ జెల్‌ను UKలోని నాటింగ్‌హామ్ శాస్త్రవేత్తలు అభివృద్ధి చేశారు. ఈ జెల్ పంటిపై రాస్తే అది లాలాజలం నుంచి కాల్షియం, ఫాస్ఫేట్‌లను గ్రహించి దంతాన్ని మళ్లీ సహజంగా మొలిపిస్తుంది. వారంలోనే మార్పు కనిపిస్తుందని బ్రషింగ్, నమలడాన్ని ఇది తట్టుకుంటుందని ప్రయోగాలు నిరూపించాయి. దీని క్లినికల్ ట్రయల్స్ 2026లో ప్రారంభం కానున్నాయి.
News January 31, 2026
ఎప్‌స్టీన్ ఫైల్స్‌లో మమ్దానీ తల్లి మీరా నాయర్ పేరు

ఎప్‌స్టీన్ తాజా డాక్యుమెంట్లలో భారత సంతతికి చెందిన ప్రముఖ దర్శకురాలు మీరా నాయర్ పేరు తెరపైకి వచ్చింది. 2009లో ఆమె తీసిన ‘అమేలియా’ సినిమా తర్వాత సెక్స్ ట్రాఫికర్ మాక్స్‌వెల్ ఇంట్లో జరిగిన పార్టీకి హాజరయ్యారని ఈ ఫైల్స్ వెల్లడించాయి. ఈ ఈవెంట్‌లో క్లింటన్, బెజోస్ కూడా పాల్గొన్నట్లు ఓ ఈమెయిల్ ద్వారా బయటపడింది. న్యూయార్క్ మేయర్ మమ్దానీకి మీరా నాయర్ తల్లి కావడంతో ఈ అంశం హాట్ టాపిక్‌గా మారింది.
News January 31, 2026
నన్ను రిటైరవ్వమన్న వారికి థాంక్స్: జకోవిచ్

ఆస్ట్రేలియన్ ఓపెన్ ఫైనల్లోకి దూసుకెళ్లిన టెన్నిస్ స్టార్ నొవాక్ జకోవిచ్ విమర్శకులపై సెటైర్లు వేశారు. ‘చాలామందికి నాపై నమ్మకం లేదు. కొందరు ఎక్స్‌పర్ట్స్ రిటైర్ అవ్వాలని సలహాలు కూడా ఇచ్చారు. ఆ మాటలు తప్పని నిరూపించేలా నన్ను మోటివేట్ చేసిన వారందరికీ ధన్యవాదాలు’ అని ఎద్దేవా చేశారు. 25 గ్రాండ్‌స్లామ్ టైటిల్స్ నెగ్గిన ఆటగాడిగా చరిత్ర సృష్టించేందుకు 38 ఏళ్ల నొవాక్ అడుగు దూరంలో ఉన్నారు.


