News September 22, 2024
బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఎల్లుండి భారీ వర్షాలు

AP: బంగాళాఖాతంలో సోమవారం అల్పపీడనం ఏర్పడుతుందని ఏపీ విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీని ప్రభావంతో ఎల్లుండి మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. మన్యం, అల్లూరి, ఏలూరు, NTR, పల్నాడు, ప్రకాశం, రాయలసీమలో మోస్తరు వర్షాలు కురుస్తాయని తెలిపింది. శ్రీకాకుళం, విజయనగరం, వైజాగ్, కోనసీమ, గుంటూరు, కృష్ణా, బాపట్ల, నెల్లూరు జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురుస్తాయంది.
Similar News
News January 23, 2026
వంట గది ఏ వైపున ఉండాలి?

వంటగది ఇంటి ఆగ్నేయ మూలలో ఉండాలని వాస్తు నిపుణులు కృష్ణాదిశేషు సూచిస్తున్నారు. దీనివల్ల సరిపడా గాలి, వెలుతురు వచ్చి ఇల్లాలు అలసట లేకుండా వంట చేయగలదని చెబుతున్నారు. ‘వంటగదిలో పూజ గది ఉండటం శ్రేయస్కరం కాదు. శుభ్రంగా ఉంచుకోవాలి. విరిగిన, పగుళ్లు ఇచ్చిన గాజు, పింగాణీ పాత్రలను ఉంచకూడదు. ఇలాంటి జాగ్రత్తలు పాటిస్తే వంట రుచికరంగా ఉంటుంది. అలాగే కుటుంబ సభ్యుల ఆరోగ్యం బాగుంటుంది’ అంటున్నారు. <<-se>>#Vasthu<<>>
News January 23, 2026
అవసరమైతే కేటీఆర్‌ను మళ్లీ పిలుస్తాం: సజ్జనార్

TG: ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ మంత్రి కేటీఆర్ విచారణపై సిట్ చీఫ్ సజ్జనార్ ప్రెస్‌నోట్ విడుదల చేశారు. విచారణ పూర్తిగా చట్టబద్ధంగా జరుగుతోందన్నారు. కేటీఆర్‌ను ఒంటరిగానే విచారించామని, ఆధారాలు ముందు పెట్టి ప్రశ్నించినట్లు చెప్పారు. సాక్షులను ప్రభావితం చేయొద్దని, అవసరమైతే మరోసారి విచారణకు పిలుస్తామని కేటీఆర్‌కు చెప్పామన్నారు. కాగా ఇవాళ కేటీఆర్‌ను సిట్ 7 గంటలకు పైగా ప్రశ్నించింది.
News January 23, 2026
మోదీకి మద్దతు ఎందుకు: YS షర్మిల

AP: రాష్ట్రానికి ఆర్థిక సాయం చేయడంలోనూ, అమరావతికి రాజధాని హోదా కల్పించడంలోనూ మోదీ ప్రభుత్వం తాత్సారం చేస్తోందని APCC చీఫ్ వైఎస్ షర్మిల ఆరోపించారు. VB-G RAM G బిల్లులోని 60:40 విధానం వలన ఏపీపై భారం పడుతుందంటూనే మరోవైపు సాయం కోరడంపై ఆగ్రహించారు. తొలుత బిల్లుకు ఎలా మద్దతు ఇచ్చారని ప్రశ్నించారు. మోదీకి చంద్రబాబు మద్దతు కొనసాగించడం ఎందుకని ప్రశ్నించారు. వెంటనే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.


