News November 23, 2024
నేడే బంగాళాఖాతంలో అల్పపీడనం.. భారీ వర్షాలు
AP: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఇవాళ అల్పపీడనం ఏర్పడనుంది. ఇది పశ్చిమ వాయవ్యంగా ప్రయాణించి సోమవారం నాటికి వాయుగుండంగా బలపడనుందని IMD తెలిపింది. తర్వాత తుఫానుగా మారి నైరుతి బంగాళాఖాతంలో ప్రవేశిస్తుందని పేర్కొంది. ఫలితంగా దక్షిణ కోస్తా, రాయలసీమలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. మరోవైపు ఉత్తరం నుంచి వీచే గాలుల ప్రభావంతో కోస్తాంధ్రలో చలి తీవ్రత పెరిగింది.
Similar News
News November 23, 2024
ప్రియాంకా గాంధీ అత్యధిక మెజారిటీతో గెలుస్తారు: రేవంత్ రెడ్డి
TG: కేరళ వయనాడ్‌లో జరిగిన ఉప ఎన్నిక ఫలితాల్లో కాంగ్రెస్ నేత ప్రియాంకా గాంధీ ఆది నుంచీ ఆధిక్యంలో కొనసాగుతుండటంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. వయనాడ్ ప్రజలు ఆమెను కచ్చితంగా రికార్డు మెజారిటీతో గెలిపించి పార్లమెంటుకు పంపిస్తారని ట్వీట్ చేశారు. ప్రస్తుతం ప్రియాంక ఇప్పటికే 2లక్షలకు పైగా ఓట్ల మెజారిటీతో విజయం దిశగా దూసుకెళ్తున్నారు.
News November 23, 2024
ప్రియాంక మెజార్టీ 2,00,000+
వయనాడ్‌లో ప్రియాంక గాంధీ బంపర్ విక్టరీ ఖాయమని స్పష్టమవుతోంది. ప్రస్తుతం ఆమె మెజార్టీ 2 లక్షలు దాటింది. దీంతో కాంగ్రెస్ ప్రముఖులు ఆమెకు అభినందనలు తెలుపుతున్నారు. కాగా కాంగ్రెస్ కంచుకోటలో పోటీ చేస్తున్న నవ్య హరిదాస్ మూడో స్థానానికి పరిమితమయ్యారు.
News November 23, 2024
మా సర్వే నిజమవుతుంది: యాక్సిస్ మై ఇండియా MD
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో ఫలితంపై సర్వే సంస్థలు అంచనా వేసిన నంబర్లు తారుమారవుతున్నాయి. ఇక్కడ మహాయుతి 150, MVA 100+ సీట్లొస్తాయని చెప్పుకొచ్చాయి. కానీ, ఫలితాలు చూస్తుంటే మహా కూటమి 200+సీట్లు గెలిచేలా కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో యాక్సిస్ మై ఇండియా MD ప్రదీప్ గుప్తా తమ సర్వే రిజల్ట్స్‌ను రీట్వీట్ చేశారు. తమ అంచనా నిజమవుతుందని మరోసారి గుర్తుచేశారు. ప్రస్తుతం MHలో 225స్థానాల్లో ‘మహా’ ముందంజలో ఉంది.