News September 1, 2025
మరో 24 గంటల్లో అల్పపీడనం: APSDMA

AP: ఈశాన్య బంగాళాఖాతం, దానికి ఆనుకుని ఉన్న మయన్మార్ తీరం మీదుగా ఉపరితల ఆవర్తనం ఆవరించి ఉందని APSDMA తెలిపింది. మరో 24 గంటల్లో ఇది అల్పపీడనంగా ఏర్పడే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రేపు విజయనగరం, అల్లూరి, వైజాగ్, అనకాపల్లి జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే ఛాన్స్ ఉందని పేర్కొంది. శ్రీకాకుళం, మన్యం, కాకినాడ, కోనసీమ, తూ.గో, ప.గో, ఏలూరు, ఎన్టీఆర్ జిల్లాల్లో మోస్తరు వానలు పడతాయని తెలిపింది.
Similar News
News September 2, 2025
IBM క్వాంటం కంప్యూటర్‌కు గ్రీన్ సిగ్నల్

AP: అమరావతి క్వాంటం కంప్యూటింగ్ సెంటర్‌లో IBM క్వాంటం కంప్యూటర్ ఏర్పాటుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2 వేల చదరపు అడుగుల్లో 133 క్యూబిట్, 5కే గేట్స్ క్వాంటం కంప్యూటర్‌ను ఏర్పాటు చేసేందుకు ఉత్తర్వులు జారీ చేసింది. చదరపు అడుగుకు రూ.30 అద్దె చెల్లించేలా IBMతో ప్రభుత్వం ఒప్పందం కుదుర్చుకుంది. IBM రాష్ట్ర ప్రభుత్వానికి నాలుగేళ్లపాటు ఏడాదికి 365 గంటల ఫ్రీ కంప్యూటింగ్ టైమ్‌ను కేటాయించనుంది.
News September 1, 2025
గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులను ప్రకటించిన కాంగ్రెస్

TG: గవర్నర్ కోటా ఎమ్మెల్సీ అభ్యర్థులుగా కోదండరాం, అజారుద్దీన్ పేర్లను కాంగ్రెస్ అధిష్ఠానం ప్రకటించింది. ఈ మేరకు ప్రకటన రిలీజ్ చేసింది. అంతకుముందు గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా ఎన్నికైన కోదండరాం, అమీర్ అలీ ఖాన్ నియామకాన్ని సుప్రీంకోర్టు <<17393463>>రద్దు<<>> చేస్తూ తీర్పు ఇచ్చిన సంగతి తెలిసిందే.
News September 1, 2025
అధికారులపై అవినీతి ఆరోపణలు.. CM సీరియస్

TG: కొందరు అధికారులు భవన నిర్మాణాలకు అనుమతుల విషయంలో అలసత్వం వహిస్తున్నారని CM రేవంత్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఉద్దేశపూర్వకంగానే వారు ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. ‘బిల్డ్ నౌ’ అనుమతులపై CM సమీక్ష నిర్వహించారు. ‘పర్మిషన్ల జారీలో నిర్లక్ష్యం వహిస్తున్న ఆఫీసర్లను సరెండర్ చేయాలి. అలాగే ఇరిగేషన్ అధికారులపై పలు ఆరోపణలు వస్తున్నాయి. అధికారులపై అవినీతి ఆరోపణలు సహించేది లేదు’ అని ఆయన స్పష్టం చేశారు.