News May 22, 2024

అల్పపీడనం.. రేపు APలోని ఈ జిల్లాల్లో వర్షాలు

image

AP: అల్పపీడనం ప్రభావంతో రేపు వర్షాలు కురుస్తాయని APSDMA తెలిపింది. మన్యం, అల్లూరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో అక్కడక్కడ పిడుగులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందంది. ఉత్తర తమిళనాడు-దక్షిణ కోస్తా తీరాలకు ఆనుకుని బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడిందని పేర్కొంది. ఎల్లుండి ఉదయానికి మధ్య బంగాళాఖాతంలో వాయుగుండంగా కేంద్రీకృతమయ్యే అవకాశం ఉందని వెల్లడించింది.

Similar News

News February 13, 2026

కాషాయ కలవరం.. పట్టించుకోని పట్టణ ఓటర్లు!

image

TG: పంచాయతీ ఎన్నికల్లో కొంత మేరకే ప్రభావం చూపిన BJP.. మున్సిపోల్స్‌పై భారీ ఆశలు పెట్టుకుంది. పట్టణ ఓటర్లు తమ వైపు ఉంటారని అంచనా వేసింది. కానీ ఫలితాల్లో వెనకబడింది. ముగ్గురు MLAలున్న ఉమ్మడి ADB జిల్లాలో ప్రభావం చూపలేదు. నిర్మల్, భైంసాలో తక్కువ సీట్లతో సరిపెట్టుకుంది. కేంద్ర మంత్రి బండి సంజయ్ MP సెగ్మెంట్‌ కరీంనగర్‌ పరిధిలో ఒక్క మున్సిపాలిటీలోనూ పోటీ ఇవ్వలేదు. మహబూబ్‌నగర్‌లో కూడా అదే పరిస్థితి.

News February 13, 2026

BJPకి ఓట్ల శాతం పెరిగింది: రామచందర్ రావు

image

TG: మున్సిపల్ ఎన్నికల్లో గతంతో పోలిస్తే BJPకి ఓటు శాతం పెరిగిందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు తెలిపారు. తమ పార్టీని ఓడించడానికి ఎంఐఎం, కాంగ్రెస్, బీఆర్ఎస్ కలిసి పనిచేశాయని ఆరోపించారు. మొత్తం వార్డులు డివిజన్లు కలిపి 350సీట్లు గెలవబోతున్నామని చెప్పారు. కరీంనగర్, నిజామాబాద్ కార్పొరేషన్లు కైవసం చేసుకోబోతున్నాం అని తెలిపారు. హంగ్ వచ్చిన చోట బీజేపీ ఎవరికీ మద్దతు ఇవ్వదని స్పష్టం చేశారు.

News February 13, 2026

తిరుమల లడ్డూ కల్తీకి, హెరిటేజ్‌కు సంబంధమేంటి: CBN

image

AP: హెరిటేజ్ సంస్థ బ్రాండ్‌ను దెబ్బతీయడమే YCP ఉద్దేశమని CM చంద్రబాబు మండిపడ్డారు. అలా చేస్తే హెరిటేజ్‌కు నష్టం వస్తుందనేది వాళ్ల భావనని విమర్శించారు. తిరుమల లడ్డూ కల్తీకి, హెరిటేజ్‌కు ఏం సంబంధమని ప్రశ్నించారు. ప్రభుత్వం నుంచి ఆ సంస్థ ఒక్క పైసా అడగలేదని అసెంబ్లీలో స్పష్టంచేశారు. తిరుమల లడ్డూ కల్తీ వ్యవహారం సున్నిత సమస్యని చెప్పారు. కొంతమంది కావాలనే భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని ఫైరయ్యారు.