News August 31, 2024
వాయుగుండంగా బలపడిన అల్పపీడనం.. అతిభారీ వర్షాలు

AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా బలపడిందని రాష్ట్ర విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. ఇవాళ అర్ధరాత్రి విశాఖ, గోపాల్‌పూర్ మధ్య కళింగపట్నం వద్ద తీరం దాటే అవకాశం ఉందని వెల్లడించింది. దీని ప్రభావంతో రాష్ట్రంలో విస్తారంగా వర్షాలు కురుస్తాయని పేర్కొంది. కోస్తాంధ్రలోని పలుచోట్ల భారీ నుంచి అతిభారీ వానలు పడతాయని తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది.
Similar News
News December 4, 2025
జెరుసలేం మాస్టర్స్ విజేతగా అర్జున్ ఇరిగేశీ

భారత చెస్ గ్రాండ్ మాస్టర్ అర్జున్ ఇరిగేశీ సత్తా చాటారు. ఫైనల్‌లో మాజీ వరల్డ్ ఛాంపియన్ విశ్వనాథన్ ఆనంద్‌ను ఓడించి జెరుసలేం మాస్టర్స్-2025 టైటిల్‌ను సొంతం చేసుకున్నారు. తొలుత రెండు ర్యాపిడ్ గేమ్‌లు డ్రా కాగా మొదటి బ్లిట్జ్ గేమ్‌లో విజయం సాధించారు. అర్జున్‌కు టైటిల్‌తో పాటు దాదాపు రూ.50లక్షల (USD 55,000) ప్రైజ్ మనీ అందజేయనున్నారు. ఈ 22ఏళ్ల కుర్రాడి స్వస్థలం తెలంగాణలోని హన్మకొండ.
News December 4, 2025
డిసెంబర్ 04: చరిత్రలో ఈ రోజు

1829: సతీ సహగమన దురాచార నిషేధం
1910: మాజీ రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ జననం
1919: మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ జననం
1922: సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు(ఫొటోలో) జననం
1977: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ జననం
1981: నటి రేణూ దేశాయ్ జననం
2021: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మరణం
– భారత నౌకాదళ దినోత్సవం
News December 4, 2025
డిసెంబర్ 04: చరిత్రలో ఈ రోజు

1829: సతీ సహగమన దురాచార నిషేధం
1910: మాజీ రాష్ట్రపతి ఆర్.వెంకట్రామన్ జననం
1919: మాజీ ప్రధాని ఐకే గుజ్రాల్ జననం
1922: సంగీత దర్శకుడు ఘంటసాల వెంకటేశ్వరరావు(ఫొటోలో) జననం
1977: బీసీసీఐ చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్ జననం
1981: నటి రేణూ దేశాయ్ జననం
2021: ఉమ్మడి ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య మరణం
– భారత నౌకాదళ దినోత్సవం


