News September 20, 2025
అల్పపీడనం ముప్పు.. అతిభారీ వర్షాలకు అవకాశం!

తెలుగు రాష్ట్రాలకు అల్పపీడనం ముప్పు పొంచి ఉందని వాతావరణ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. అది తుఫానుగా మారే అవకాశమూ ఉందని అంచనా వేశారు. సెప్టెంబర్ 25 నుంచి 28 వరకు ఉత్తరాంధ్రతో పాటు తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించారు. రెండు రోజుల్లో ఈ అల్పపీడనంపై పూర్తి అవగాహన వస్తుందని చెప్పారు.
Similar News
News September 20, 2025
నవంబర్ 14న నాగార్జున ‘శివ’ రీరిలీజ్

అక్కినేని నాగార్జున కెరీర్‌లో బిగ్గెస్ట్ బ్లాక్‌బస్టర్‌గా నిలిచిన ‘శివ’ సినిమా రీరిలీజ్ తేదీ ఖరారైంది. ఇండియన్ సినిమాను షేక్ చేసిన ‘శివ’ నవంబర్ 14న రీరిలీజ్ అవుతుందని నాగ్ ట్వీట్ చేశారు. అక్కినేని నాగేశ్వరరావు జయంతి సందర్భంగా ప్రకటించడం సంతోషంగా ఉందన్నారు. 4K క్వాలిటీ & డాల్బీ అట్మాస్ సౌండ్‌తో ఈ చిత్రం ఉంటుందని తెలిపారు. అమల హీరోయిన్‌గా నటించిన ఈ చిత్రాన్ని రామ్ గోపాల్ వర్మ తెరకెక్కించారు.
News September 20, 2025
హరీశ్ రావుపై ఆ విషయంలోనే కోపం: కవిత

TG: కొత్త పార్టీపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని MLC కవిత స్పష్టం చేశారు. కాంగ్రెస్‌లో చేరే ఆలోచన లేదన్నారు. ‘పార్టీ పెట్టే ముందు KCR వందల మందితో చర్చించారు. నేనూ అదే చేస్తున్నా. తండ్రి పార్టీ నుంచి సస్పెండైన మొదటి కూతుర్ని నేనే. హరీశ్ రావుపై కాళేశ్వరం విషయంలో తప్ప వేరే ఏ విషయంలో కోపం లేదు. కాళేశ్వరం విషయంలో ప్రతీ నిర్ణయం KCRదేనని కమిషన్‌కు హరీశ్ చెప్పారు’ అని మీడియా చిట్ చాట్‌లో పేర్కొన్నారు.
News September 20, 2025
రేపటి నుంచి దసరా సెలవులు

TG: గురుకులాలతో పాటు ప్రభుత్వ, ప్రైవేటు స్కూళ్లకు దసరా సెలవులు రేపటి నుంచి ప్రారంభం కానున్నాయి. అక్టోబర్ 3 వరకు సెలవులు ఉండనున్నాయి. అటు జూనియర్ కాలేజీలకు ఈ నెల 28 నుంచి అక్టోబర్ 6 వరకు హాలిడేస్ ప్రకటించారు. మరోవైపు గురుకుల సొసైటీ పరిధిలోని సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ కాలేజీలకు మాత్రం వారం రోజులు ఆలస్యంగా సెలవులు ఇచ్చారని, వాటికి కూడా రేపటి నుంచే సెలవులు ఇవ్వాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.