News April 18, 2024
తగ్గిన బంగారం ధరలు

భారీగా పెరుగుతున్న బంగారం ధరలు ఇవాళ కాస్త తగ్గుముఖం పట్టాయి. హైదరాబాద్‌లో 24 క్యారెట్ల మేలిమి బంగారం రూ.330 తగ్గింది. దీంతో 10 గ్రాముల గోల్డ్ రేట్ ప్రస్తుతం రూ.73,800కు చేరింది. 22 క్యారెట్ల పసిడి 10 గ్రాములకు రూ.300 దిగి రూ.67,650గా నమోదైంది. అటు వెండి ధరలు స్థిరంగా ఉన్నాయి. కేజీ సిల్వర్ రేట్ రూ.90,000 పలుకుతోంది.
Similar News
News August 13, 2025
సురేశ్ రైనాకు ED సమన్లు

టీమిండియా మాజీ క్రికెటర్ సురేశ్ రైనాకు ఈడీ సమన్లు జారీ చేసింది. బెట్టింగ్ యాప్ ప్రమోషన్స్ కేసులో భాగంగా రేపు విచారణకు హాజరు కావాలని కోరింది. ఢిల్లీలోని ఈడీ ప్రధాన కార్యలయంలో రైనాను విచారించనున్నారు. ఓ బెట్టింగ్ యాప్‌కు సురేశ్ రైనా బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరించారు. ఇప్పటికే బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసులో పలువురు బాలీవుడ్ నటులు, సెలబ్రిటీలను ఈడీ విచారిస్తోంది.
News August 13, 2025
అతిగా నిద్రపోతే ఈ వ్యాధులు తప్పవట!

అతి నిద్ర కూడా ఆరోగ్యానికి ముప్పేనని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. ‘9 గంటల కంటే ఎక్కువసేపు నిద్రపోయేవారిలో మధుమేహం, ఊబకాయం, గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది. అలాగే వెన్ను నొప్పి, తల నొప్పితోపాటు డిప్రెషన్‌కు కూడా గురవుతారు. రాత్రి పూట ఎక్కువగా భోజనం చేయకూడదు. రోజూ ఒకే సమయానికి నిద్ర పోయి, ఒకే సమయానికి మేల్కోవడం అలవాటు చేసుకోవాలి. దీంతో నిద్రపోయే సమయాన్ని తగ్గించుకోవచ్చు’ అని చెబుతున్నారు.
News August 13, 2025
చంద్రబాబు, పవన్‌కు థాంక్స్: జూ.ఎన్టీఆర్

‘వార్ 2’ మూవీకి టికెట్ రేట్లు <<17383707>>పెంచుతూ<<>> AP ప్రభుత్వం జీవో ఇవ్వడంపై హీరో జూ.ఎన్టీఆర్ స్పందించారు. ‘ఈ జీవో ఆమోదించినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు హృదయపూర్వక ధన్యవాదాలు. సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేశ్ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను’ అని తారక్ ట్వీట్ చేశారు.