News August 23, 2024
తగ్గిన బంగారం ధరలు

హైదరాబాద్ మార్కెట్లో బంగారం ధరలు తగ్గాయి. 10 గ్రాముల 24 క్యారెట్ల గోల్డ్ రూ.220 తగ్గి రూ.72,650కి చేరింది. 10 గ్రాముల 22 క్యారెట్ల పసిడి రూ.200 తగ్గి రూ.66,600 పలుకుతోంది. అటు కేజీ వెండి ధర రూ.300 తగ్గి రూ.91,700గా ఉంది.
Similar News
News March 21, 2026
ఇవాళ సెలవు

రంజాన్ సందర్భంగా తెలుగు రాష్ట్రాల్లో ఇవాళ ప్రభుత్వ కార్యాలయాలు, విద్యాసంస్థలకు సెలవు ఉండనుంది. తొలుత జారీ చేసిన హాలిడేస్ లిస్ట్‌లో సెలవు నిన్న ఉండగా నెలవంక దర్శనం ఆధారంగా పండుగ శనివారం జరుపుకోవాలని ముస్లిం మతపెద్దలు నిర్ణయించారు. దీంతో ప్రభుత్వాలు నేడు సెలవు దినంగా ప్రకటించాయి. ఈ కారణంగా ఏపీలో ఇవాళ జరగాల్సిన పదో తరగతి ఇంగ్లిష్ పరీక్షను ఏప్రిల్ 2కు వాయిదా వేశారు.
News March 21, 2026
రాష్ట్రానికి కమర్షియల్ గ్యాస్ కోటా పెరిగింది: నాదెండ్ల

AP: రాష్ట్రానికి కమర్షియల్ గ్యాస్ కోటా పెరిగిందని మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. ప్రస్తుతం ఉన్న 4,500 మెట్రిక్ టన్నుల కోటాను 5,200 మెట్రిక్ టన్నులకు కేంద్రం పెంచిందని వెల్లడించారు. పాఠశాలలు, కాలేజీలకు వేసవి సెలవులు వస్తుండటంతో అక్కడికి పంపే సిలిండర్లను హోటళ్లకు ఇస్తామని హోటల్స్ జేఏసీ బృందానికి హామీ ఇచ్చారు. మరోవైపు త్వరలోనే కిరోసిన్‌ను ప్రజలకు సరఫరా చేస్తామని పేర్కొన్నారు.
News March 21, 2026
ముస్లింల వస్తువులు వద్దన్నారు.. క్రూడాయిల్ ఎందుకు కొంటున్నారు: అసద్

TG: దేశంలోని పలు రాష్ట్రాల్లో ముస్లింలు తయారుచేసే వస్తువులు కొనవద్దని తీర్మానం చేసిన బీజేపీ అరబ్ దేశాల నుంచి క్రూడాయిల్ ఎందుకు కొనుగోలు చేస్తోందని ఎంఐఎం ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ ప్రశ్నించారు. ప్రధాని మోదీ విదేశాలకు వెళ్లి భారత్‌లో అన్ని వర్గాల కోసం పని చేస్తున్నామని చెప్తుండటం పచ్చి అబద్ధమన్నారు. దేశంలో గ్యాస్, పెట్రోలియం కొరత ఉన్నా అలాంటిదేం లేదని చెబుతూ ప్రజలను మోసం చేస్తున్నారని విమర్శించారు.


