News May 26, 2024

IPL చరిత్రలో ఫైనల్లో అతి తక్కువ స్కోర్

image

KKRతో జరుగుతున్న ఫైనల్లో 113 రన్స్‌కే పరిమితమైన SRH.. IPL చరిత్రలో ఫైనల్లో అతి తక్కువ స్కోర్ చేసిన జట్టుగా నిలిచింది. 2013లో ముంబైపై చెన్నై 125/9 రన్స్ చేసింది. 2017లో పుణేతో మ్యాచులో ముంబై 129/8 పరుగులకే పరిమితమైంది. అయితే ఛేజింగ్‌కు దిగిన పుణేను ముంబై 128/6 రన్స్‌కే కట్టడి చేసి ఒక పరుగు తేడాతో విజయం సాధించింది.

Similar News

News October 14, 2025

వంటింటి చిట్కాలు

image

* అల్లం, వెల్లుల్లి పేస్ట్ చేసే ముందు వాటిని వేయిస్తే పేస్ట్ ఎక్కువ రోజులు తాజాగా ఉంటుంది.
* తేనెలో నాలుగైదు మిరియాలు వేస్తే చీమలు పట్టకుండా ఉంటాయి.
* చికెన్ ఉడికించేటప్పుడు ఒక కోడిగుడ్డు చేర్చడం వల్ల రుచి పెరుగుతుంది.
* కూరలు, గ్రేవీ మాడినట్లు గుర్తిస్తే వాటిలో వెన్న, పెరుగు కలిపితే వాసన రాకుండా ఉంటుంది.
<<-se>>#VantintiChitkalu<<>>

News October 14, 2025

1,064 కిలోల గుమ్మడికాయను పండించాడు

image

గుమ్మడికాయలు సాధారణంగా 3-5KGల బరువు ఉంటాయి. ఇంకా జాగ్రత్తగా పెంచితే 10-20KGల వరకు బరువు పెరగొచ్చు. కానీ కాలిఫోర్నియాలోని సాంట రోసాకు చెందిన బ్రాండన్ డ్వాసన్ ప్రత్యేక పద్ధతులతో 1,064 KGల గుమ్మడికాయను పండించారు. కాలిఫోర్నియాలో జరిగిన గుమ్మడికాయల ప్రదర్శన పోటీలో డ్వాసన్ విజేతగా నిలిచి 20 వేల డాలర్లు గెలుచుకున్నారు. ఇంజినీర్ అయిన డ్వాసన్ ఐదేళ్లుగా అతి పెద్ద గుమ్మడికాయలను సాగు చేస్తున్నారు.

News October 14, 2025

కొత్త PF నిర్ణయాలు.. ఒక్కసారి ఆలోచించండి

image

EPFO ఎంప్లాయి షేర్ 100%తో పాటు ఎంప్లాయర్ షేర్ 100% విత్‌డ్రాకు అనుమతిస్తూ నిర్ణయించింది. ఇది ఊరటగా భావించి డబ్బు తీసుకుందాం అనుకుంటే.. ఆలోచించండి. ఇతర మార్గాలతో పోలిస్తే ఇక్కడ తీసుకుంటే లాభం అనుకుంటేనే డ్రా చేయండి. ఎందుకంటే ప్రభుత్వ సేవింగ్ స్కీమ్స్‌లో PFకు ఖాతాకే అధిక వడ్డీరేటు (8.25%) ఉంది. ఇప్పుడు తాత్కాలిక అవసరాలకు సర్దుకుంటే PFలో డబ్బుకు వడ్డీ, వడ్డీపై వడ్డీల లాభం భవిష్యత్తులో అండగా ఉంటుంది.