News April 15, 2025

డబ్బు కాదు విధేయత ముఖ్యం.. అందుకే KKRను వీడలేదు: రమణ్‌దీప్

image

KKR తనను రూ.4 కోట్లకు రిటైన్ చేసుకోవడం వెనుక ఉన్న కథను రమణ్‌దీప్ వెల్లడించారు. వేలానికి ముందు రిటైన్‌కు ఒప్పుకోవద్దని, రూ.9-10 కోట్లతో కొనుగోలు చేస్తామని చాలా టీమ్స్ ఆఫర్ ఇచ్చాయన్నారు. అయితే తనకు తొలుత అవకాశం ఇచ్చిన KKRపై విధేయత ఉందని చెప్పారు. అందుకే డబ్బు తక్కువైనా టీమ్‌లోనే ఉంటానని మేనేజ్‌మెంట్‌కు చెప్పినట్లు తెలిపారు. వేలంలోకి వెళితే ఇదే జట్టులోకి వస్తాననే గ్యారంటీ లేదన్నారు.

Similar News

News April 17, 2025

WEF జాబితాలో కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు

image

కేంద్ర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు వరల్డ్ ఎకనామిక్ ఫోరం జాబితాలో చోటు సంపాదించుకున్నారు. దాదాపు 50కి పైగా దేశాలకు చెందిన 116మందికి యంగ్ గ్లోబల్ లీడర్స్‌గా WEF చోటు కల్పించింది. భారత్ నుంచి మెుత్తంగా ఏడుగురు ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు. వివిధ రంగాలలో ప్రతిభ కనబరిచిన 40 సంవత్సరాలలోపు వ్యక్తులను యంగ్ గ్లోబల్ లీడర్స్‌గా WEF గుర్తిస్తుంది.

News April 17, 2025

వేసవి సెలవులొస్తే ఇలా ఉండేది!

image

వారం రోజుల్లో వేసవి సెలవులొస్తున్నాయ్. ఇప్పుడంటే సెలవు రోజుల్లో టీవీలు, మొబైల్స్‌కు అతుక్కుపోతున్నారు. ఎండను చూసి భయపడుతున్నారు. కానీ, 90S కిడ్స్‌ అలా ఉండేవాళ్లు కాదు. మండుటెండలోనూ రస్నా తాగేసి సూర్యుడికి ఎదురుగా నిలబడేవాళ్లు. పాత టైర్‌తో ఊరంతా చుట్టేయడం, గోలీల ఆట, తొక్కుడు బిళ్ల, దాగుడు మూత, కోతి కొమ్మచ్చి, అష్టాచెమ్మా, కర్రబిళ్ల వంటి ఆటలు ఆడుతూ రోజంతా ఎంజాయ్ చేసేవాళ్లు. మీరూ ఇలానే చేసేవారా?

News April 17, 2025

వివాదంలో MLA ఆదినారాయణరెడ్డి

image

AP: జమ్మలమడుగు BJP MLA ఆదినారాయణరెడ్డి మరో వివాదంలో చిక్కుకున్నారు. కడప జిల్లా ఎర్రగుంట్ల(మ) చిలమకూరు వద్ద ఆల్ట్రాటెక్ సిమెంట్ సంస్థకు చెందిన ఫ్లైయాష్ వాహనాలను అడ్డుకుంటున్నారన్న సంస్థ ఫిర్యాదుతో ఎర్రగుంట్ల పీఎస్‌లో ఆయనతో పాటు అనుచరులపై కేసు నమోదైంది. పరిశ్రమలో కాంట్రాక్ట్ పనుల అప్పగింత, ఫ్లైయాష్, సున్నపురాయి వెళ్లకుండా MLA అడ్డుకుంటున్నారని సంస్థ ప్రతినిధులు కలెక్టర్, SP దృష్టికి తీసుకెళ్లారు.

error: Content is protected !!