News March 14, 2025
LRSపై నిర్లక్ష్యం వస్తే కఠిన చర్యలు: అదనపు కలెక్టర్

మున్సిపాలిటీలు, పంచాయతీల్లో ఎల్ఆర్ఎస్ పై నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని అదనపు కలెక్టర్ మాధురి హెచ్చరించారు. కలెక్టర్ కార్యాలయంలో గురువారం సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఎల్ఆర్ఎస్ రోజువారి పరిష్కారం నివేదికలు పంపించాలని చెప్పారు. దీనిపై ప్రజలకు పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. 31లోగా డబ్బులు చెల్లిస్తే 25% రాయితీ ఉంటుందన్నారు. ఈ సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 21, 2025
అట్టహాసంగా మిస్ వరల్డ్ పోటీలు: మంత్రి

TG: రాష్ట్రంలో జరగనున్న మిస్ వరల్డ్ పోటీలను ‘తెలంగాణ జరూర్ ఆనా’ నినాదంతో ప్రారంభించనున్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. మే10న గచ్చిబౌలి స్టేడియంలో ప్రారంభ వేడుకలు జరగనుండగా 31న హైటెక్స్‌లో ముగింపు వేడుకలను నిర్వహించనున్నారు. మెుత్తంగా 21 ప్రదేశాల్లో 23థీమ్‌లతో ఈవెంట్ నిర్వహించేలా ప్రణాళికలు వేస్తున్నారు. మే7నుంచి31వరకు ఈ పోటీలు జరగనున్నాయి.
News March 21, 2025
కన్యాకుమారి- గుంటూరుకి ప్రత్యేక రైలు.!

చీపురుపల్లి నుంచి గుంటూరు మీదుగా కన్యాకుమారికి ప్రత్యేక రైలు నడవనట్లు దక్షిణామద్య రైల్వే గురువారం సాయంత్రం తెలిపారు. ట్రైన్ నంబర్ 07230 చీపురుపల్లి టు కన్యాకుమారి, 07229 కన్యాకుమారి నుంచి చీపురుపల్లి ఏప్రిల్ రెండో తారీకు నుంచి జూన్ 27వ తారీకు వరకు ఈ రైలు సర్వీసులు నడుస్తాయని వెల్లడించారు. ఈ సౌకర్యని ప్రయాణికులు ఉపయోగించుకోవాలని కోరారు.
News March 21, 2025
పల్నాడు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధిపై JC సమీక్ష

పల్నాడు జిల్లాలో పారిశ్రామిక అభివృద్ధి, ఎగుమతి ప్రోత్సాహ కమిటీ సమావేశాన్ని జాయింట్ కలెక్టర్ అధ్యక్షతన గురువారం నిర్వహించారు. పారిశ్రామిక పార్కుల్లో ప్లాట్ల కేటాయింపు, చిన్న, సూక్ష్మత రహ పరిశ్రమలకు ప్రోత్సాహంపై చర్చించారు. సింగిల్ డెస్క్ పోర్టల్ అనుమతుల పురోగతి గురించి చర్చించారు. మార్చి నెలలో 129 దరఖాస్తులు రాగా.. 122 ఆమోదించబడ్డాయని కమిటీ తెలిపింది. బ్యాంకులలో రుణాలు వేగంగా ఉండాలన్నారు.