News March 25, 2025
LRS చెల్లింపులపై విస్తృత ప్రచారం చేయాలి: ASF కలెక్టర్

లే ఔట్ భూముల క్రమబద్ధీకరణలో భాగంగా LRS రుసుము చెల్లింపులపై ప్రజలందరికీ తెలిసే విధంగా విస్తృత ప్రచారం నిర్వహించాలని కలెక్టర్ వెంకటేశ్ దోత్రే అధికారులకు సూచించారు. వాంకిడి గ్రామపంచాయతీలో LRS -2020లో భాగంగా దరఖాస్తు చేసుకున్న వారిలో అర్హులైన లబ్ధిదారులు ఈ నెల 31లోగా రుసుము చెల్లించేలా చర్యలు తీసుకోవాలన్నారు.
Similar News
News December 7, 2025
జిల్లాల్లో తెలంగాణ తల్లి విగ్రహావిష్కరణకు ముహూర్తం ఫిక్స్

TG: ‘ప్రజాపాలన-ప్రజా విజయోత్సవాలు’ వేడుకల్లో భాగంగా ఎల్లుండి ఉ.10 గంటలకు జిల్లా కేంద్రాల్లో తెలంగాణ తల్లి విగ్రహాలను ఆవిష్కరించాలని కలెక్టర్లను సీఎస్ రామకృష్ణారావు ఆదేశించారు. అందుకు తగిన ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. గత ఏడాది డిసెంబర్ 9న సచివాలయంలో విగ్రహాన్ని సీఎం రేవంత్ ఆవిష్కరించిన సంగతి తెలిసిందే. రేపటి నుంచి జరిగే గ్లోబల్ సమ్మిట్లోనూ ఈ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని సీఎం ఆదేశించారు.
News December 7, 2025
NLG: అప్పుల్లో మునిగిన తెలంగాణ: కాంగ్రెస్పై కిషన్ రెడ్డి ఆరోపణ

కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణను అప్పుల్లో ముంచిందని, ఉద్యోగులకు జీతాలు చెల్లించడానికి భూములను అమ్ముకునే పరిస్థితి వచ్చిందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి విమర్శించారు. నల్గొండలో ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్, రేవంత్ ప్రభుత్వాల అవినీతి పాలనలో ఎలాంటి మార్పు లేదన్నారు. భూముల అమ్మకాలతోనే ప్రభుత్వం నెట్టుకొస్తుందని, గ్యారంటీలు ఏ వర్గానికి ఉపయోగపడలేదని దుయ్యబట్టారు.
News December 7, 2025
HIV బాధితుల పట్ల వివక్ష చూపొద్దు: మంత్రి నిమ్మల

2030 నాటికి HIV రహిత రాష్ట్రంగా మార్చేందుకు కృషి చేస్తునట్లు మంత్రి నిమ్మల రామానాయుడు చెప్పారు. పాలకొల్లులో ధర్మారావు ఫౌండేషన్ ఆధ్వర్యంలో HIV బాధితులకు చేయూత కార్యక్రమంలో ఆదివారం మంత్రి పాల్గొన్నారు. HIV బాధితులకు పౌష్టికాహారం, నిత్యవసర సరుకుల బ్యాగులను మంత్రి పంపిణీ చేసారు. సమాజంలో HIV బాధితుల పట్ల మానవత్వం, ప్రేమానురాగాలతో మెలగాలని, వారి పట్ల వివక్ష చూపవద్దని కోరారు.


