News March 2, 2025
LRS దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి: కలెక్టర్

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలైన LRS దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న LRS దరఖాస్తుల పరిష్కారం కోసం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తుల క్షేత్ర స్థాయి పరిశీలన ప్రక్రియ నిర్వహించాలని సూచించారు.
Similar News
News October 14, 2025
మర్కూక్: మాగంటి సునితకు బీఫాం అందజేసిన కేసీఅర్

జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల్లో BRS అభ్యర్థి మాగంటి సునీతకు కేసీఆర్ బీఫామ్ అందజేశారు. మర్కూక్ మండలం ఎర్రవల్లిలోని ఫాంహౌస్లో జరిగిన కార్యక్రమంలో ఎన్నికల ఖర్చు కోసం రూ.40 లక్షల చెక్కు ఇచ్చారు. దివంగత మాగంటి గోపీనాథ్ కుటుంబాన్ని ఆయన ఆశీర్వదించారు. మాజీ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి, పద్మారావు గౌడ్ తదితరులు హాజరయ్యారు.
News October 14, 2025
గిరిజన ఉత్పత్తులకు అధిక లాభాలు రావాలి: కలెక్టర్

జిల్లాలోని గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లు ఎక్కువ స్థాపించేందుకు ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులను కలెక్టర్ వెట్రి సెల్వి ఆదేశించారు. మంగళవారం కలెక్టర్ మాట్లాడుతూ.. గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు. ఐటీడీఏ గిరిజన ఉత్పత్తులను మరింత పెంచాలన్నారు. వాటి నాణ్యత, ఆకర్షణీయమైన ప్యాకింగ్, మార్కెట్ సౌకర్యం కల్పించి అధిక లాభాలు వచ్చేలా చేయాలన్నారు.
News October 14, 2025
పెట్టుబడుల్లో వెండే ‘బంగారం’

బంగారం, వెండి ధరలు రోజురోజుకు ఆకాశాన్నంటుతున్నాయి. చాలామంది వీటిని సేఫెస్ట్ ఆప్షన్గా భావిస్తూ భారీగా పెట్టుబడులు పెడుతున్నారు. అయితే గోల్డ్ కంటే సిల్వర్ ఎక్కువ రిటర్న్స్ ఇస్తోందన్న విషయం తెలుసా? గత ఐదేళ్లలో బంగారంపై 33.15%, వెండిపై అత్యధికంగా 37.23% లాభాలు వచ్చాయి. అదే సమయంలో సెన్సెక్స్ కేవలం 2.64% రిటర్న్స్ ఇవ్వగలిగింది. లాంగ్టర్మ్లో సిల్వర్, గోల్డ్ బెటర్ అని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.