News March 22, 2025

LRS రాయితీకి మార్చ్ 31 వరకే అవకాశం

image

మార్చ్ 31 నాటికి LRS క్రమబద్ధీకరణ చేసుకుంటే రుసుంలో 25% మినహాయింపు ఉంటుందని ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన వీసీలో జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెలాఖరు వరకు LRS దరఖాస్తు పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీపీఓ జయసుధ, మున్సిపల్ కమిషనర్లు జాకీర్, విక్రమసింహారెడ్డి, వెంకటయ్య, వేణుగోపాల్ తదితరులున్నారు.

Similar News

News February 25, 2026

ఉపాధి పనులు శనివారంలోపు ప్రారంభించాలి: కలెక్టర్

image

ఉపాధి హామీ, ఫ్యామిలీ సర్వే, అక్షరాంధ్ర అంశాలపై కలెక్టర్ డా.ఏ.సిరి బుధవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. పథకం కింద మంజూరైన పనులన్నీ శనివారం నాటికి ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు. అక్షరాంధ్రకు నమోదు చేసుకున్న వారందరూ తప్పనిసరిగా పరీక్షలకు హాజరు కావాలన్నారు. క్షేత్రస్థాయి నుంచి పనుల పురోగతిని ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని సూచించారు. లక్ష్యాలను సకాలంలో పూర్తి చేయాలని ఆమె స్పష్టం చేశారు.

News February 25, 2026

‘మామ్స్ బ్రెయిన్’ అంటే ఏమిటి?

image

సాధారణంగా ప్రసవం తర్వాత కొందరు మహిళలు మతిమరుపునకు లోనవుతుంటారు. దీన్నే”మామ్స్ బ్రెయిన్” అంటారు. ఈ సమస్య నుంచి బయటపడాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. డెలివరీ తర్వాత బిడ్డ సంరక్షణలో పడి పోషకాహారం తీసుకోవడం మానేస్తారు. బాలింతలు మంచి పోషకాహారం తీసుకోవడం చాలా ముఖ్యమని నిపుణులు చెబుతున్నారు. ఆకుకూరలు, పండ్లు, పప్పు దినుసులు తీసుకోవడం వల్ల బాలింతలు ఆరోగ్యంగా ఉండి మతిమరుపు, ఇతర సమస్యలకు దూరంగా ఉండవచ్చు.

News February 25, 2026

బాసర ట్రిపుల్ ఐటీలో విద్యార్థిని ఆత్మహత్య..?

image

బాసర ట్రిపుల్ ఐటీలో మరో విషాదం చోటుచేసుకుంది. ఇంజినీరింగ్ ప్రథమ సంవత్సరం (E1) చదువుతున్న వసంత బుధవారం తన హాస్టల్ గదిలో ఉరివేసుకున్నట్లు సమాచారం. తోటి విద్యార్థుల సమాచారంతో వర్సిటీ అధికారులు ఆమెను భైంసా ఏరియా ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. వనపర్తి జిల్లాకు చెందిన వసంత ఆత్మహత్యకు గల కారణాలపై పోలీసులు విచారణ జరుపుతున్నారు.