News March 2, 2025

LRS దరఖాస్తులను వెంటనే పరిష్కరించండి: కలెక్టర్

image

భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా భూముల క్రమబద్ధీకరణకు సంబంధించి దాఖలైన LRS దరఖాస్తులను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్ అధికారులను ఆదేశించారు. శనివారం జిల్లా వ్యాప్తంగా పెండింగ్లో ఉన్న LRS దరఖాస్తుల పరిష్కారం కోసం అధికారులతో సమీక్ష నిర్వహించారు. మొబైల్ యాప్ ద్వారా దరఖాస్తుల క్షేత్ర స్థాయి పరిశీలన ప్రక్రియ నిర్వహించాలని సూచించారు.

Similar News

News December 25, 2025

విశాఖ స్టీల్ ప్లాంటులో మూడో విడత VRS

image

AP: విశాఖ స్టీల్ ప్లాంట్‌లో 3వ విడత VRSకు యాజమాన్యం నోటిఫికేషన్ ఇచ్చింది. 2027 JAN 1 తర్వాత పదవీ విరమణకు అర్హులయ్యే ఉద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానించింది. 15ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకొని 45ఏళ్లు దాటిన ఉద్యోగులను అర్హులుగా పేర్కొంది. ఈ ఏడాది ప్రారంభంలో తొలిసారి 1,146, రెండోసారి 487 మంది VRSకు అంగీకరించారు. ఈసారి 570 మందికి వీఆర్ఎస్ ఇవ్వాలనే లక్ష్యంతో నోటిఫికేషన్ ఇచ్చినట్లు తెలుస్తోంది.

News December 25, 2025

నరసరావుపేట: రెవెన్యూ శాఖలో జమాబంది తెలుసా.?

image

రెవెన్యూ శాఖలో కీలకమైన జమాబందీ ప్రక్రియను గత కొన్ని ఏళ్లుగా ఉన్నతాధికారులు విస్మరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆర్‌ఓఆర్‌ ప్రకారం రికార్డుల సక్రమ నిర్వహణకు జమాబందీ అత్యంత కీలకమైనదైనా, ఏ కారణం చేతనో అధికారులు దీనిపై దృష్టి సారించడం లేదని విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీంతో అనేక తహశీల్దార్ కార్యాలయాల్లో భూ సంబంధిత రికార్డుల నిర్వహణ సరిగా లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.

News December 25, 2025

ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగితే.!

image

ఉదయం నిద్ర లేవగానే నీళ్లు తాగితే పలు ప్రయోజనాలున్నాయి. ‘రాత్రి నిద్రలో శరీరం నీటిని కోల్పోతుంది. కాబట్టి వాటర్ తాగడం ద్వారా శరీరం హైడ్రేట్ అవుతుంది. ఇది అలసట, తలనొప్పి తగ్గించి శక్తిని పెంచుతుంది. జీర్ణక్రియ మెరుగై మలబద్దకం ఉన్నవారికి సహాయపడుతుంది. మెటబాలిజం 20-30% పెరిగి శరీర బరువు నియంత్రణలో ఉంటుంది. వ్యర్థాలు మూత్రం ద్వారా బయటకు పోతాయి. రోగనిరోధక శక్తి పెరుగుతుంది’ అని వైద్యులు చెబుతున్నారు.