News March 22, 2025

LRS రాయితీకి మార్చ్ 31 వరకే అవకాశం

image

మార్చ్ 31 నాటికి LRS క్రమబద్ధీకరణ చేసుకుంటే రుసుంలో 25% మినహాయింపు ఉంటుందని ప్రిన్సిపల్ సెక్రెటరీ దాన కిషోర్ తెలిపారు. శుక్రవారం నిర్వహించిన వీసీలో జిల్లా అడిషనల్ కలెక్టర్ సుధీర్ హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ.. ఈ నెలాఖరు వరకు LRS దరఖాస్తు పూర్తి చేస్తామని తెలిపారు. కార్యక్రమంలో డీపీఓ జయసుధ, మున్సిపల్ కమిషనర్లు జాకీర్, విక్రమసింహారెడ్డి, వెంకటయ్య, వేణుగోపాల్ తదితరులున్నారు.

Similar News

News March 23, 2025

సిద్దిపేట: ఫిబ్రవరి 9న సౌదీలో మృతి.. నేడు అంత్యక్రియలు

image

సౌదీ అరేబియాకు బతుకు దేరువు నిమిత్తం కోహెడ మండలంలోని శ్రీరాములపల్లి గ్రామానికి చెందిన జాలిగం అశోక్ వెళ్లగా ఫిబ్రవరి 9న ప్రమాదవశాత్తు మృతి చెందాడు. మృతదేహం స్వగ్రామం చేరడానికి కుటుంబ సభ్యులు కేంద్ర మంత్రి బండి సంజయ్ ను వేడుకున్నారు. సౌదీ అరేబియా ఎంబసీ అధికారులతో ఎంపీ మాట్లాడి శనివారం మృతదేహాన్ని స్వగ్రామానికి తీసుకువచ్చారు. శనివారం కుటుంబ సభ్యులు అంత్యక్రియలు పూర్తి చేశారు.

News March 23, 2025

మెదక్: ఇంటర్ విద్యార్థి MISSING

image

మెదక్ జిల్లా శివంపేట మండలం దంతాన్ పల్లికి చెందిన ఇంటర్ విద్యార్థి అదృశ్యమైనట్లు ఎస్ఐ మధుకర్ రెడ్డి తెలిపారు. దంతాన్ పల్లి గ్రామానికి చెందిన గొల్ల రేవంత్ కుమార్ (17) శనివారం పొలం వద్దకు వెళ్లి అదృశ్యమైనట్లు ఎస్ఐ వివరించారు. మొబైల్ ఫోను స్విచ్ ఆఫ్ రావడంతో తండ్రి గొల్ల మల్లేష్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుకర్ రెడ్డి పేర్కొన్నారు.

News March 23, 2025

కొత్త డీజీపీ ఎంపికపై రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు

image

AP: కొత్త DGP ఎంపిక కోసం రాష్ట్ర ప్రభుత్వం ఐదుగురు IPS అధికారుల పేర్లను కేంద్రానికి పంపింది. ఈ లిస్టులో రాజేంద్రనాథ్ రెడ్డి, మాదిరెడ్డి ప్రతాప్, హారీశ్ కుమార్ గుప్తా, కుమార్ విశ్వజిత్, సుబ్రహ్మణ్యం పేర్లు ఉన్నాయి. ఇందులో ముగ్గురి పేర్లను కేంద్రం తిరిగి రాష్ట్రానికి పంపనుంది. ప్రస్తుతం ఇన్‌ఛార్జ్ DGPగా ఉన్న హరీశ్ కుమార్‌నే మరో రెండేళ్లు DGPగా కొనసాగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు సమాచారం.

error: Content is protected !!