News March 8, 2025
LRS సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి: కలెక్టర్

మార్చి 31 చివరి నాటికి 25 శాతం రాయితీతో ఎల్.ఆర్.ఎస్ చేయించుకోవాలని వనపర్తి జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి అన్నారు. ఎల్. ఆర్.ఎస్ లేని వారు మార్చి 31 తర్వాత ఇల్లు కట్టుకోవాలనుకుంటే ఎలాంటి రాయితీ లేకుండా ప్రస్తుత మార్కెట్ విలువకు 14 శాతం పెనాల్టీతో రిజిస్ట్రేషన్ చేయించుకోవాల్సి ఉంటుందని హెచ్చరించారు. ప్రభుత్వం కల్పించిన ఎల్.ఆర్.ఎస్ సదవకాశాన్ని కొనుగోలుదారులు సద్వినియోగం చేసుకోవాలన్నారు.
Similar News
News July 6, 2025
కన్నాయిగూడెం: మత్స్యకారుల వలకు చిక్కిన దెయ్యం చేప

కన్నాయిగూడెం మండలంలోని మత్స్యకారుల వలకు ఓ వింత చేప చిక్కింది. దీంతో జాలర్లు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దెయ్యం చేపగా పిలుచుకునే ఈ చేప తినడానికి, ఔషధాల తయారీకి కూడా పనికిరాదని మత్స్యకారులు తెలిపారు. కాగా, ఈ చేప నదిలో, చెరువులో ఎక్కడున్నా మిగతా చేపలను, వాటి గుడ్లను తినడం వంటి లక్షణాలున్న ప్రమాదకరమైన చేప అన్నారు. ఈ చేపలు ఉన్నచోట మిగతా చేపలు కూడా ఎదుగుదల ఉండదని మత్స్యకారులు ఆందోళన చెందుతున్నారు.
News July 6, 2025
మరో ఘోరం.. భర్తను చంపిన భార్య

TG: NZB(D) బోధన్(మ) మినార్‌పల్లి గ్రామంలో <<16952152>>మరో దారుణం <<>>జరిగింది. కట్టుకున్న భర్తను ఓ భార్య కిరాతకంగా హత్య చేసింది. భర్త దేశ్యనాయక్(57) మద్యానికి బానిసై ఏ పనిచేయకుండా ఖాళీగా తిరుగుతున్నాడు. దీనిపై పలుమార్లు ఇద్దరి మధ్య వాగ్వాదం జరగ్గా, శుక్రవారం కూడా వివాదం తలెత్తింది. దీంతో కత్తితో భర్తపై దాడి చేసి గొంతులో పొడిచింది. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ నిన్న చనిపోయాడు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
News July 6, 2025
వరంగల్ జిల్లాలో చికెన్ ధరలు ఇలా!

వరంగల్ జిల్లాలో నేడు చికెన్ ధరలు ఇలా ఉన్నాయి. విత్ స్కిన్ కేజీ రూ.170 ధర పలుకుతోంది. స్కిన్‌లెస్ కేజీ రూ.200-210 పలుకుతుండగా, లైవ్ కోడి కేజీ రూ.140-150 మధ్య ధర ఉంది. సిటీతో పోలిస్తే పల్లెల్లో ధర రూ.10-20 వ్యత్యాసం ఉంది. నేడు తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా కొంత కొనుగోళ్లు పెరిగినట్లు వ్యాపారులు చెబుతున్నారు.