News April 5, 2024
LS ఎలక్షన్స్: సింగిల్ డిజిట్ తేడాతో గెలిచింది వీరే

లోక్సభ ఎన్నికల్లో 1962 నుంచి ఇప్పటివరకూ ఇద్దరు అభ్యర్థులు సింగిల్ డిజిట్ తేడాతో గెలిచారు. 1989లో ఉమ్మడి APలోని అనకాపల్లి స్థానానికి కాంగ్రెస్ తరఫున పోటీ చేసిన కొణతాల రామకృష్ణ 9 ఓట్ల తేడాతో గెలిచారు. ఆ తర్వాత 1998లో బిహార్లోని రాజ్మహల్లో BJP అభ్యర్థి సోం మరాండీ కూడా 9 ఓట్ల తేడాతో గెలుపొందారు. కాగా రామకృష్ణ ప్రస్తుతం అనకాపల్లి అసెంబ్లీ స్థానానికి JSP అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. <<-se>>#Elections2024<<>>
Similar News
News April 22, 2025
రేపు 39 మండలాల్లో తీవ్ర వడగాలులు

AP: రేపు రాష్ట్రంలోని 39 మండలాల్లో తీవ్ర వడగాలులు, 21 మండలాల్లో వడగాలులు వీస్తాయని APSDMA తెలిపింది. శ్రీకాకుళం(7), విజయనగరం(17), మన్యం(13), అల్లూరి జిల్లాలోని 2 మండలాల్లో తీవ్ర వడగాలులు వీస్తాయని అంచనా వేసింది. మరోవైపు ఇవాళ నంద్యాల జిల్లాలోని దోర్నిపాడులో 43.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైనట్లు తెలిపింది. సిద్ధవటం-43.8, కర్నూలు-43.5, వతలూరు-42.9, పెద్ద దోర్నాలలో 42.8 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది.
News April 22, 2025
CM రేవంత్ వస్తేనే నా పెళ్లి: వైరా యువకుడు

TG: CM రేవంత్ వస్తేనే తాను పెళ్లి చేసుకుంటానని ఖమ్మం జిల్లాకు చెందిన ఓ యువకుడు భీష్మించుకొని కూర్చున్నాడు. సీఎం ఎప్పుడు వస్తే అప్పుడే ముహూర్తం ఫిక్స్ చేసుకుంటానన్నాడు. లేదంటే పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటానని చెబుతున్నాడు. వైరాకు చెందిన భూక్యా గణేష్ అనే యువకుడు MLA రామ్దాస్ మాలోతుకు ఓ లెటర్ రాశాడు. తన పెళ్లికి CMను తీసుకొచ్చే బాధ్యత ఆయనదేనంటూ విన్నవించాడు. ఆ లెటర్ను MLA కూడా CMకు పంపాడు.
News April 22, 2025
J&Kలో ఉగ్రదాడి.. ఖండించిన సీఎంలు

J&Kలో జరిగిన ఉగ్రవాదుల కాల్పుల్లో పర్యాటకులు మృతి చెందిన ఘటన తీవ్ర దిగ్భ్రాంతిని కలిగించిందని సీఎం రేవంత్ ట్వీట్ చేశారు. ‘ఈ దుశ్చర్యను ఖండిస్తున్నాను. ఇలాంటి దొంగ దెబ్బలతో భారతీయుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయలేరు. ఉగ్రవాద మూకల విషయంలో అత్యంత కఠినంగా వ్యవహరించాలని కేంద్రాన్ని కోరుతున్నా’ అని పేర్కొన్నారు. అమాయక పర్యాటకులపై ఉగ్రవాదులు దాడి చేయడం హేయమైన చర్య అని ఏపీ సీఎం చంద్రబాబు ట్వీట్ చేశారు.