News May 1, 2024

LS ELECTIONS: భువనగిరిలో గెలుపెవరిది?

image

TG: భువనగిరి నియోజకవర్గం 2009లో ఏర్పడగా, ఇప్పటివరకు మూడు సార్లు ఎన్నికలు జరిగాయి. ఒక్కసారి గెలిచిన అభ్యర్థి మరోసారి గెలవలేదు. కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి(INC) 2009లో గెలిచి, 2014లో ఓడారు. 2014లో గెలిచిన బూర నర్సయ్య గౌడ్ (BRS) 2019లో వెంకట్‌రెడ్డి (INC) చేతిలో ఓటమిపాలయ్యారు. ఈసారి ఎన్నికల్లో కిరణ్ కుమార్(INC), బూర నర్సయ్య (BJP), క్యామ మల్లేశ్(BRS), జహంగీర్ (CPM) పోటీలో ఉన్నారు. <<-se>>#Elections2024<<>>

Similar News

News March 3, 2026

ప్రపంచ యాత్రికుడు.. 24 ఏళ్ల వయసులోనే!

image

బిహార్‌కు చెందిన 24 ఏళ్ల కుర్రాడు నోమాడ్ శుభమ్ ప్రపంచ దేశాలను చుట్టేసి రికార్డు సృష్టించారు. మొత్తం 197 దేశాలను చుట్టేసిన అతి పిన్న వయస్కుడైన భారతీయుడిగా నిలిచాడు. అయితే విమానాల్లో ప్రయాణించకుండా కేవలం లిఫ్టులు, లోకల్ బస్సుల్లో వెళ్తూ ఈ ఘనత సాధించడం విశేషం. తన 16ఏళ్ల వయసులో మొదలైన ఈ సాహసయాత్ర 9ఏళ్ల పాటు కొనసాగి తాజాగా బ్రెజిల్‌లో ముగిసింది. సంకల్పం ఉంటే ప్రపంచాన్ని జయించవచ్చని శుభమ్ నిరూపించాడు.

News March 3, 2026

ఇంజినీర్స్ ఇండియా లిమిటెడ్‌లో ఉద్యోగాలు

image

<>ఇంజినీర్స్ <<>>ఇండియా లిమిటెడ్ 6 జూనియర్ సెక్రటరీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. డిగ్రీ(ఫైన్ ఆర్ట్స్), డిప్లొమా అర్హతతో పాటు పని అనుభవం గలవారు మార్చి 12 వరకు అప్లై చేసుకోవచ్చు. స్కిల్ టెస్ట్, మెరిట్, పని అనుభవం ఆధారంగా ఎంపిక చేస్తారు. నెలకు రూ.29,000-రూ.1,20,000 చెల్లిస్తారు. వెబ్‌సైట్: https://www.engineersindia.com/

News March 3, 2026

చంద్రబాబుతో పవన్ కీలక భేటీ

image

AP: సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. ఉండవల్లిలోని నివాసానికి చేరుకున్న పవన్‌కు సీఎం స్వాగతం పలికారు. ఆపై ఇరువురూ సమావేశమయ్యారు. టీటీడీ అంశంతో పాటు రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలపైనా చర్చించనున్నట్లు తెలుస్తోంది. రాజ్యసభ, నామినేటెడ్ పదవులపై చర్చించే అవకాశముంది. అలాగే తన శాఖలకు సంబంధించిన అంశాలపైనా పవన్ చంద్రబాబుతో మాట్లాడనున్నట్లు సమాచారం.