News May 20, 2024

LS PHASE 5: పోలింగ్ శాతం 36.72% @1PM

image

లోక్‌సభ ఎన్నికల ఐదో విడతలో మధ్యాహ్నం 1గంటలకు పోలింగ్ శాతం 36.72గా నమోదైంది. లద్దాఖ్‌లో గరిష్ఠంగా 52.02% పోలింగ్ నమోదు కాగా కనిష్ఠంగా మహారాష్ట్రలో 27.78% పోలింగ్ రికార్డ్ అయింది. మరోవైపు జమ్మూకశ్మీర్‌లో బారాముల్లా నియోజకవర్గంలో ఈసారి రికార్డ్ స్థాయి పోలింగ్ నమోదవుతోంది. 1 గంటకు ఇక్కడ 34.79% పోలింగ్ నమోదైంది. కాగా గత ఎన్నికల్లో పోలింగ్ ముగిసే సమయానికి పోలింగ్ శాతం 34.89కే పరిమితం అయింది.

Similar News

News February 6, 2026

గుడ్‌న్యూస్.. భారీగా పెరగనున్న జీతాలు!

image

దేశంలో ఉద్యోగ మార్కెట్‌ క్రమంగా కోలుకుంటుండటంతో జీతాల్లో పెంపు ప్రారంభమైందని మైఖేల్‌ పేజ్‌ ఇండియా వెల్లడించింది. ఈ ఏడాది అన్ని రంగాల్లో జీతాల పెంపు సగటున 8 నుంచి 12 శాతం వరకు ఉండొచ్చని ‘ది శాలరీ గైడ్‌-2026’ నివేదికలో తెలిపింది. కొత్త స్కిల్స్ ఉన్నవారు ఉద్యోగాలు మారితే కంపెనీలు 30 శాతం వరకు అధిక జీతాలు ఆఫర్‌ చేస్తున్నాయని పేర్కొంది. CFO, CTO, ఇంజినీరింగ్‌ హెడ్స్‌కు డిమాండ్‌ పెరిగిందని తెలిపింది.

News February 6, 2026

ఆఫీస్‌ స్పేస్‌కు పెరుగుతున్న డిమాండ్

image

TG: హైదరాబాద్‌లో ఆఫీస్‌ స్పేస్ మార్కెట్‌ వేగంగా విస్తరిస్తోంది. 2026-27 ఆర్థిక సంవత్సరం చివరికి కొత్తగా దాదాపు 19 మిలియన్‌ చదరపు అడుగుల గ్రేడ్‌-ఏ ఆఫీస్‌ స్పేస్ అందుబాటులోకి వస్తుందని ఇక్రా నివేదిక తెలిపింది. వీటిలో పావు వంతు వాటికి ఇప్పటికే లీజ్ ప్రక్రియ పూర్తయిందని వెల్లడించింది. IT, బ్యాంకింగ్, ఫైనాన్స్, ఇన్సూరెన్స్‌ రంగాల నుంచి డిమాండ్‌ ఉంది. లీజు ధరలు ఏడాదికి 3-4% పెరుగుతూ వస్తున్నాయి.

News February 6, 2026

ఆస్ట్రేలియాకు బిగ్ షాక్.. హేజిల్‌వుడ్ దూరం

image

ఆస్ట్రేలియా పేసర్ హేజిల్‌వుడ్ గాయం కారణంగా T20 WC మొత్తానికి దూరమయ్యారు. ఆయనకు రీప్లేస్‌మెంట్‌ను త్వరలో ప్రకటిస్తామని క్రికెట్ AUS తెలిపింది. కాగా ఇప్పటికే కమిన్స్ గాయం కారణంగా దూరం కాగా, స్టార్క్ రిటైరయ్యారు. వీరు లేకుండానే AUS ఆడబోతోంది.
టీమ్: మార్ష్, బార్ట్‌లెట్, కొన్నోలీ, T డేవిడ్, డ్వార్షుయిస్, గ్రీన్, ఎల్లిస్, హెడ్, ఇంగ్లిస్, కుహ్నెమాన్, మాక్స్‌వెల్, రెన్షా, స్టోయినిస్, జంపా. రిజర్వ్: అబాట్