News May 20, 2024
LS PHASE 5: ‘అయోధ్య’ ఓటు ఎవరికి? – 2/2

బీజేపీ ఇక్కడ వరుసగా రెండుసార్లు గెలిచినా ఎస్పీకి ఓట్ షేర్ పెరగడం చర్చనీయాంశమైంది. బీజేపీకి 2014లో 48.08%, 2019లో 48.66% రాగా SPకి 2014లో 20.43%, 2019లో 42.64% నమోదైంది. అయోధ్యలో పర్యాటక రంగం వృద్ధిపై కొందరిలో సంతృప్తి ఉన్నా పేదలను పట్టించుకోలేదనే అసంతృప్తి గ్రామాల్లో ఉన్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో నేటి పోలింగ్‌లో ఓటర్లు మార్పు కోరుకుంటారా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.<<-se>>#Elections2024<<>>
Similar News
News December 24, 2025
హాదీ హత్య వెనుక యూనస్ ప్రభుత్వం.. సోదరుడి ఆరోపణ

బంగ్లాదేశ్‌లో అల్లర్లకు కారణమైన ఉస్మాన్ హాదీ హత్యపై ఆయన సోదరుడు ఒమర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఫిబ్రవరిలో జరిగే ఎన్నికలను అస్థిరపరిచేందుకు యూనస్ ప్రభుత్వంలోని కీలక వ్యక్తులే ఈ హత్య చేయించారని ఆరోపించారు. కాగా హాదీపై ఈ నెల 12న కాల్పులు జరగగా ఆయన సింగపూర్‌లో చికిత్స పొందుతూ మరణించారు. దీంతో దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున అల్లర్లు జరుగుతున్న విషయం తెలిసిందే.
News December 24, 2025
వైభవ్ మరో సెంచరీ

విజయ్ హజారే ట్రోఫీలో వైభవ్ సూర్యవంశీ చెలరేగారు. బిహార్ తరఫున ఆడుతున్న అతను అరుణాచల్‌తో మ్యాచ్‌లో 36 బంతుల్లోనే సెంచరీ చేశారు. ఇందులో 10 ఫోర్లు, 8 సిక్సర్లు ఉన్నాయి. ప్రస్తుతం డబుల్ సెంచరీ దిశగా అతని ఇన్నింగ్స్ కొనసాగుతోంది.
News December 24, 2025
డెడ్‌లైన్ @ డెత్‌లైన్: ఊపిరి ఆడని స్థితిలోనూ బాస్ కఠినత్వం

అనారోగ్యం కారణంగా బ్రేక్ తీసుకుంటానన్న ఉద్యోగికి బాస్ ఇచ్చిన సమాధానం ఇప్పుడు SMలో చర్చకు దారితీసింది. బ్రీతింగ్ ఇష్యూ వల్ల వెంటనే డాక్టర్‌ను కలవాలని క్లోజింగ్ టైమ్‌కు కాస్త ముందు అడిగినా కనికరించలేదు ఆ పెద్దమనిషి. డెడ్‌లైన్‌లోపు పని పూర్తి చేయాల్సిందేనని ఇచ్చిన ఆన్సర్ కార్పొరేట్ కల్చర్‌పై ప్రశ్నలు లేవనెత్తుతోంది. ఎంజాయ్ చేయలేని స్థితిలో ఎంత శాలరీ వస్తే ఏంటని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు.


