News May 25, 2024

LS PHASE 6: పోలింగ్ శాతం 39.13%@ 1PM

image

లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌లో ఓటింగ్ శాతం మధ్యాహ్నం 1 గంటకు 39.13%గా రికార్డ్ అయింది. బెంగాల్‌లో గరిష్ఠంగా 54.80% పోలింగ్ నమోదైంది. ఆ తర్వాత స్థానాల్లో ఝార్ఖండ్ (42.54%), యూపీ (37.23%), బిహార్ (36.48%), హరియాణా (36.48%), ఒడిశా (35.69%), జమ్మూకశ్మీర్ (35.22%), ఢిల్లీ (34.37%) ఉన్నాయి. మరోవైపు ఒడిశా ఫేజ్-3 అసెంబ్లీ ఎన్నికల్లో 35.69% పోలింగ్ నమోదైంది.

Similar News

News October 30, 2025

ఈ డివైజ్‌తో అందమైన పాదాలు మీ సొంతం

image

పాదాల సంరక్షణ కోసం వచ్చిందే ఈ ఎలక్ట్రిక్‌ కాలస్‌ రిమూవర్‌. ఈ మల్టీఫంక్షనల్‌ పెడిక్యూర్‌ కిట్‌‌లో డెడ్‌ స్కిన్‌ రిమూవల్‌ హెడ్‌తో పాటు, నెయిల్‌ బఫర్‌ హెడ్, పాలిషింగ్‌ హెడ్ వస్తాయి. దీనికి ముందువైపు పవర్‌ బటన్‌ ఉంటుంది. స్పీడ్ అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఈ డివైస్‌తో పెడిక్యూర్‌ చేసుకోవడం చాలా సులభం. ఇది మృతకణాలను తొలగించి పాదాలను మృదువుగా మార్చడమే కాకుండా బ్యాక్టీరియా పెరుగుదలనూ నిరోధిస్తుంది.

News October 30, 2025

12NHలపై EV ఛార్జింగ్ కేంద్రాల ఏర్పాటుకు ఆమోదం

image

TG: రాష్ట్రంలోని 12 నేషనల్ హైవేస్‌పై ఎలక్ట్రిక్ వెహికల్ (EV) పబ్లిక్ ఛార్జింగ్ స్టేషన్లు రానున్నాయి. PM e-డ్రైవ్ పథకం కింద NHA 13 రూట్లలోని ప్రాంతాలను ప్రతిపాదించగా కేంద్రం 12 స్టేషన్లను ఆమోదించింది. NH44(ఆదిలాబాద్-మహబూబ్ నగర్), NH65 (జహీరాబాద్-కోదాడ), NH163 (వికారాబాద్-ములుగు), NH765 (హైదరాబాద్-దిండి) ఇందులో ఉన్నాయి. NH150 (సంగారెడ్డి)ని మినహాయించారు. స్టేషన్లు ఏర్పాటుపై రాయితీలు ఇస్తారు.

News October 30, 2025

రేపు స్కూళ్లకు సెలవు ఉంటుందా?

image

తెలుగు రాష్ట్రాల్లో తుఫాన్ ప్రభావం కొనసాగుతోంది. APలోని శ్రీకాకుళం, విజయనగరం, అనకాపల్లి, అల్లూరి, ఉమ్మడి గోదావరి జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. తెలంగాణలోని వరంగల్, హనుమకొండ, కరీంనగర్, సిద్దిపేట, జనగామ జిల్లాల్లో వర్షాలు తగ్గుముఖం పట్టినా వరద ప్రభావం తగ్గలేదు. దీంతో రేపు కూడా స్కూళ్లకు సెలవు ఇవ్వాలనే డిమాండ్లు వినిపిస్తున్నాయి.