News May 25, 2024
LS PHASE 6: పోలింగ్ శాతం 57.70%@ 5PM

లోక్‌సభ ఎన్నికల ఆరో విడత పోలింగ్‌లో ఓటింగ్ శాతం సాయంత్రం 5 గంటలకు 57.70%గా నమోదైంది. అత్యధికంగా బెంగాల్లో 77.99% ఓటింగ్ రికార్డ్ అయింది. ఆ తర్వాతి స్థానాల్లో ఝార్ఖండ్ (61.41%), ఒడిశా (59.60%), హరియాణా (55.93%), ఢిల్లీ (53.73%), జమ్మూకశ్మీర్ (51.35%), బిహార్ (52.24%), యూపీ (52.02%) ఉన్నాయి. మరోవైపు ఒడిశా అసెంబ్లీ ఎన్నికల్లో 59.60% పోలింగ్ నమోదైంది.
Similar News
News December 3, 2025
చంద్రంపేట: పూట గడవక.. అప్పు తీర్చలేక.. కార్మికుడి బలవన్మరణం

సిరిసిల్ల చంద్రంపేట పరిధిలోని జ్యోతి నగర్‌కు చెందిన బోడ శేఖర్ అనే నేతకార్మికుడు ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పరిశ్రమ సంక్షోభంతో సొంత మగ్గాలు నడవక, కార్మికుడిగా మారి పనిచేస్తున్నా పూట గడవకపోవడం, అప్పు తీరే మార్గం కనిపించకపోవడంతో అతడు ఈ అఘాయిత్యానికి పాల్పడ్డాడని పోలీసులు తెలిపారు. పని సరిగ్గా లేకపోవడం, రూ.40లక్షల వరకు అప్పులు పెరగడంతో మంగళవారం ఇంట్లో ఎవరూలేని సమయంలో ఉరివేసుకున్నట్లు పేర్కొన్నారు.
News December 3, 2025
మరో మైలురాయికి చేరువలో రోహిత్ శర్మ

టీమ్ఇండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ మరో అరుదైన మైలురాయికి చేరువలో ఉన్నారు. మరో 41 రన్స్ చేస్తే అంతర్జాతీయ క్రికెట్లో 20వేల పరుగులు చేసిన 4వ భారత బ్యాటర్‌గా అవతరించనున్నారు. 503 మ్యాచ్‌లలో 42.46 సగటు, 50 సెంచరీలు, 110 హాఫ్ సెంచరీలతో 19,959 పరుగులు చేశారు. సచిన్ 34,357, కోహ్లీ 27,808, ద్రవిడ్ 24,064 రన్స్‌తో మొదటి 3 స్థానాల్లో ఉన్నారు. కాగా సౌతాఫ్రికా, భారత్ మధ్య నేడు 2వ వన్డే జరగనుంది.
News December 3, 2025
4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసం ప్రత్యేకత

4G బుల్లెట్ సూపర్ నేపియర్ పశుగ్రాసాన్ని అన్ని రకాల నేలల్లో కొద్ది నీటి వసతితో పెంచవచ్చు. ఇది ఏడాదికి 6-7 సార్లు కోతకు వస్తుంది. దీనిలో తీపిదనం ఎక్కువగా ఉండటం వల్ల పశువులు ఇష్టంగా తింటాయి. ఎకరం గడ్డి 10 ఆవులకు సరిపోతుంది. దీనిలో ప్రొటీన్ కంటెంట్ 16-18 శాతంగా ఉంటుంది. ఫైబర్ కూడా ఎక్కువ. దీని వల్ల పశువుల్లో పాల ఉత్పత్తి మరింత పెరుగుతుంది. దీని ఆకులు మృదువుగా ఉండటం వల్ల రైతులు కోయడం కూడా సులభం.


