News June 6, 2024

LS POLLS: తగ్గిన మహిళా ఎంపీల సంఖ్య

image

ఈ లోక్‌సభ ఎన్నికల్లో 797 మంది మహిళా అభ్యర్థులు పోటీ చేస్తే 74 మంది విజేతలుగా నిలిచారు. గరిష్ఠంగా బెంగాల్ నుంచి 11 మంది మహిళా ఎంపీలు ఎన్నికయ్యారు. అయితే 2019 ఎన్నికలతో పోలిస్తే మహిళా ఎంపీల సంఖ్య స్వల్పంగా తగ్గింది. అప్పుడు 78 మంది మహిళలు ఎన్నికయ్యారు. దీంతో 18వ లోక్‌సభలో మహిళా ఎంపీల ప్రాతినిథ్యం 13.62శాతంగా ఉండనుంది. భవిష్యత్తులో ఈ సంఖ్య పెరగాల్సిన అవసరం ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

Similar News

News January 10, 2025

స్పెలింగ్ ఎలా మర్చిపోతారు బ్రో!

image

లగ్జరీ బ్రాండ్స్ ప్రొడక్ట్స్‌ను కాపీ చేస్తూ పేరులో స్పెలింగ్ మార్చి అమ్మేస్తుంటారు. అయితే, ఒరిజినల్ ప్రొడక్ట్ షాపు పేరులోనే స్పెలింగ్ తప్పుగా ఉంటే ఎలా ఉంటుంది? హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన ఓ PUMA షోరూమ్ పేరును PVMAగా ఏర్పాటుచేయడంపై నెట్టింట చర్చ జరుగుతోంది. ఇది వినేందుకు హాస్యాస్పదంగా ఉన్నా.. సంస్థకు నష్టాన్ని తెచ్చిపెట్టింది. ఇది ఫేక్ బ్రాండ్ అనుకొని కస్టమర్లు అటువైపు వెళ్లేందుకే ఇష్టపడలేదు.

News January 10, 2025

బాలకృష్ణ, వెంకటేశ్ సినిమాలకు BIG SHOCK

image

AP: సంక్రాంతికి విడుదలయ్యే డాకు మహారాజ్, సంక్రాంతికి వస్తున్నాం సినిమాల అదనపు షోలలో ప్రభుత్వం సవరణలు చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు అర్ధరాత్రి 1 గంట, తెల్లవారుజామున 4 గంటల షోలకు అనుమతి నిరాకరించింది. రోజుకు 5 షోలకు మించకుండా, అందులో ఒక బెనిఫిట్ షో ప్రదర్శించుకోవచ్చంది. దీంతో ఎల్లుండి రిలీజయ్యే డాకు మహారాజ్, 14న విడుదలయ్యే సంక్రాంతికి వస్తున్నాం చిత్రాలకు 6వ షో ఉండదు. ఇది వసూళ్లపై ప్రభావం చూపనుంది.

News January 10, 2025

BREAKING: ‘తిరుపతి’ ఘటనపై హైకోర్టులో పిల్

image

AP: తిరుపతి తొక్కిసలాటపై హైకోర్టులో పిల్ దాఖలైంది. ఈ ఘటనపై 5 రోజుల్లో న్యాయ విచారణ జరిపించి, 30 రోజుల్లో గవర్నర్‌కు నివేదిక ఇచ్చేలా పోలీస్ అధికారులను ఆదేశించాలని పిటిషనర్ కోరారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. మొత్తం 20 మందిని ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిల్ త్వరలోనే విచారణకు రానుంది.