News March 15, 2026

LSGకి బిగ్ షాక్?

image

ఈ నెలాఖరున ప్రారంభమయ్యే IPLలో LSG జట్టుకు కీలక ప్లేయర్ దూరం కానున్నట్లు క్రీడావర్గాలు తెలిపాయి. ఆ జట్టు స్టార్ ఆల్‌రౌండర్ వనిందు హసరంగా గాయం కారణంతో ఈ సీజన్ ఆడటం అనుమానమే అని అంటున్నాయి. తొడ కండరాల గాయం వల్ల T20WCలోనూ అతను ఆడలేదు. ఇప్పటికీ పూర్తిగా కోలుకోలేదని సమాచారం. ఈసారి వేలంలో ఇతడిని LSG రూ.2కోట్లకు సొంతం చేసుకున్న విషయం తెలిసిందే. గత సీజన్లో హసరంగా RR తరఫున ఆడి 11 వికెట్లు తీశారు.

Similar News

News March 28, 2026

ఇంటి బాల్కనీలో ఈ మొక్కలు పెంచండి

image

ఇంటి గాలిని శుభ్రపరిచేందుకు సహజసిద్ధమైన మార్గం మొక్కలే. మన బాల్కనీలో పెంచుకునే లావెండర్, స్నేక్ ప్లాంట్, పీస్ లిల్లీ, కలబంద వంటివి గాల్లోని విషతుల్యాలను తొలగించి స్వచ్ఛమైన ఆక్సిజన్‌ను అందిస్తాయి. ముఖ్యంగా మల్లె, రోజ్‌మేరీ, పుదీనా వెదజల్లే సువాసనలు మనసుకు ఉల్లాసాన్నిచ్చి, ఒత్తిడిని తగ్గిస్తాయి. ఆధ్యాత్మికంగా, ఆరోగ్యపరంగా మేలు చేసే తులసి, బంతి ఉంటే మనలో పాజిటివ్ ఎనర్జీ కూడా పెరుగుతుంది.

News March 28, 2026

4 లీటర్ల పెట్రోల్ దాచాడని 3 వారాలు జైలు శిక్ష

image

పశ్చిమాసియాలో యుద్ధం వల్ల ఇంధన కొరతతో దేశాలు అల్లాడుతున్నాయి. ఈ నేపథ్యంలో 4 లీటర్ల పెట్రోల్ దాచాడనే కారణంతో శ్రీలంక కోర్టు బాలసూర్య అనే వ్యక్తికి 3 వారాల జైలు శిక్ష, రూ.1,500 ఫైన్ విధించింది. అతను అక్రమంగా పెట్రోల్‌ను నిల్వ చేసి బ్లాక్ మార్కెట్‌లో విక్రయించే ప్రయత్నం చేశాడని పోలీసులు వెల్లడించారు. అయితే తాను ఇంటి పరిసరాల్లో చెత్తను కాల్చేందుకు తెచ్చుకున్నానని నిందితుడు తెలిపారు.

News March 28, 2026

నేడు గంటపాటు లైట్లు బంద్ చేయండి

image

పర్యావరణ పరిరక్షణ కోసం ‘ఎర్త్ అవర్’ పాటించాలనే సంప్రదాయం 2007లో మొదలైంది. ఈసారి మార్చి 28 రాత్రి 8.30 నుంచి 9.30 గం. వరకు ఒక గంటపాటు అనవసర విద్యుత్ దీపాలను ఆర్పివేసి ఈ కార్యక్రమంలో భాగం కావాలని పర్యావరణ ప్రేమికులు పిలుపునిచ్చారు. పచ్చదనం పెంచడం, సుస్థిర భవిష్యత్తును నిర్మించడమే లక్ష్యంగా ఈ చిన్న ప్రయత్నం పర్యావరణంలో పెద్ద మార్పుకు నాంది పలుకుతుందని వారు పేర్కొన్నారు.