News October 31, 2024

LSG రిటెన్షన్ లిస్టు

image

IPL-2025 కోసం తాము రిటెన్షన్ చేసుకున్న జట్టును LSG ప్రకటించింది. ఇప్పటివరకు ఆ జట్టుకు కెప్టెన్‌గా ఉన్న కేఎల్ రాహుల్‌ను వదులుకుంది. నికోలస్ పూరన్‌ను అత్యధికంగా రూ.21 కోట్లకు రిటైన్ చేసుకుంది. రవి బిష్ణోయ్(రూ.11 కోట్లు), మయాంక్ యాదవ్(రూ.11 కోట్లు), మోసిన్ ఖాన్(రూ.4 కోట్లు), ఆయుష్ బదోనీ(రూ.4కోట్లు) LSG రిటైన్ చేసుకుంది.

Similar News

News October 23, 2025

వరిలో కంపు నల్లి – నివారణకు సూచనలు

image

ఖరీఫ్ వరి పంటలో గింజ పాలు పోసుకొనే దశలో కంపు నల్లి ఆశించడం వల్ల గింజపై నల్లని మచ్చలు ఏర్పడి, గింజలు తాలుపోతాయి. నవంబరు వరకు దీని తీవ్రత ఎక్కువగా ఉంటుంది. బూడిద, ఆకుపచ్చ రంగులోని నల్లి పురుగులు పంటను ఆశిస్తాయి. వీటి వల్ల పొలంలో చెడు వాసన వస్తుంది. ఈ నల్లిని సాయంత్రం వేళ పొలంలో గమనించవచ్చు. వీటి నివారణకు లీటరు నీటికి క్లోరిపైరిఫాస్ 2.5ml లేదా మలాథియాన్ 2ml కలిపి సాయంత్రం వేళ పిచికారీ చేయాలి.

News October 23, 2025

మ్యూజిక్ డైరెక్టర్ సబేశన్ కన్నుమూత

image

తమిళ్ మ్యూజిక్ డైరెక్టర్ MC సబేశన్(68) కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన చెన్నైలో మరణించారు. లెజెండరీ మ్యూజిక్ కంపోజర్ దేవా సోదరుడే సబేశన్. తన మరో సోదరుడు మురళీతో కలిసి దేవా వద్ద అసిస్టెంట్‌గా పనిచేశారు. తర్వాత సబేశన్-మురళి జోడీ పాపులరైంది. పొక్కిషమ్, కూడల్ నగర్, మిలగ, గొరిపలయమ్, 23వ పులకేశి, అదైకాలమ్, పరాయ్ మొదలైన చిత్రాలకు సంగీతం అందించింది. రేపు చెన్నైలో సబేశన్ అంత్యక్రియలు జరుగుతాయి.

News October 23, 2025

మానవాళికి దైవానుగ్రహం ఎందుకు అవసరం?

image

మనం వేసిన విష బీజం విష ఫలాన్నే ఇస్తుంది. అలాగే మన చెడు కర్మల ఫలితంగా మనకు బాధలు, దుఃఖాలు కలుగుతాయి. ఈ కర్మ బంధాన్ని తెంచుకోవడం మానవ ప్రయత్నంతో సాధ్యం కాదు. ఎందుకంటే, మన కర్మలన్నీ అసంఖ్యాకమైనవి. అందుకే, ఈ బంధాల నుంచి విముక్తి పొందడానికి దైవానుగ్రహం అవసరం. ఆ దేవుడి కృప మనకు లభించినప్పుడు, ఆయన శక్తి మన కర్మ ఫలాలను తొలగించి, కష్టాల నుంచి విముక్తిని, నిజమైన ఆనందాన్ని ప్రసాదిస్తుంది. <<-se>>#Daivam<<>>