News April 12, 2024

LSGvsDC: ఢిల్లీ టార్గెట్ 168 రన్స్

image

ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరుగుతోన్న మ్యాచ్‌లో LSG 20 ఓవర్లలో 167/7 స్కోర్ చేసింది. కేఎల్ రాహుల్ 39, డికాక్ 19 రన్స్ చేయగా, చివర్లో ఆయుష్ బదోని 35 బంతుల్లో 55 పరుగులతో అదరగొట్టారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ 3, ఖలీల్ అహ్మద్ 2, ఇషాంత్ శర్మ, ముకేశ్ కుమార్ చెరో వికెట్ తీశారు.

Similar News

News April 13, 2026

వాట్సాప్‌కు ప్రత్యామ్నాయంగా ‘XChat’: మస్క్

image

వాట్సాప్ డేటా భద్రతపై <<19612326>>విమర్శలు<<>> వస్తున్న వేళ X అధినేత ఎలాన్ మస్క్ ‘XChat’ను ప్రకటించారు. ఏప్రిల్ 17న iOSలో లాంచ్ కానున్న ఈ యాప్‌కు ఫోన్ నంబర్ అవసరం లేదు. ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్, స్క్రీన్‌షాట్ బ్లాకింగ్, సెల్ఫ్-డిస్ట్రక్ట్ మెసేజ్(వాటంతటవే మెసేజ్‌లు డిలీట్) వంటి ఫీచర్లు ఉండనున్నాయి. ఈ సూపర్ యాప్‌లో 481 మందితో గ్రూప్ చాట్స్, ఆడియో-వీడియో కాల్స్ చేసుకోవచ్చు. మీ X అకౌంట్‌తోనే దీనిని వాడవచ్చు.

News April 13, 2026

RCB సూపర్ రికార్డ్

image

వాంఖడే వేదికగా MIతో జరిగిన మ్యాచ్‌లో గెలవడం ద్వారా ఆర్సీబీ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. 200+ స్కోర్‌ను డిఫెండ్ చేసుకొని అత్యధిక విజయాలు(23) సాధించిన జట్టుగా CSK సరసన చేరింది. ఆ తర్వాత MI, SRH(18), RR, KKR(15) ఉన్నాయి. ఇక వాంఖడేలో 2016 నుంచి వరుసగా ముంబై చేతిలో ఆరు మ్యాచుల్లో ఓడిపోయిన ఆర్సీబీకి.. ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. ఓవరాల్‌గా వరుసగా నాలుగో గెలుపు.

News April 13, 2026

స్కూళ్లను 11AM వరకే నిర్వహించాలని విజ్ఞప్తి

image

AP: రాష్ట్రంలో ఎండలు మండిపోతున్నాయి. చాలా చోట్ల 43-45 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఉ.11 గంటల వరకే ఒంటి పూట బడులు నిర్వహించాలని మోడల్ స్కూల్స్ ప్రోగ్రెసివ్ టీచర్స్ అసోసియేషన్ విద్యాశాఖకు విజ్ఞప్తి చేసింది. విద్యార్థులు ఎండలకు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని కోరింది. కాగా ఏప్రిల్ 24 నుంచి జూన్ 11 వరకు స్కూళ్లకు వేసవి సెలవులు ఉండనున్నాయి.