News July 23, 2024
LTCG పరిమితి పెంపు.. కానీ!

కేంద్రం LTCG పన్ను మినహాయింపును ఏటా రూ.లక్ష నుంచి రూ.1.25 లక్షలకు పెంచింది. పన్ను రేటును మాత్రం 10-12.5%కి పెంచింది. దీంతో మిడిల్ క్లాస్‌కు ప్రయోజనం ఉంటుందని పేర్కొనడం గమనార్హం. ఇక STCG పన్ను రేటును 15-20 శాతానికి చేర్చింది. లిస్టెడ్ అసెట్స్‌ను ఏడాది దాటితే లాంగ్ టర్మ్‌గా పరిగణించింది. బాండ్లు, డెట్ MFలు, డిబెంచర్లకు కాలంతో సంబంధం లేకుండా క్యాపిటల్ గెయిన్స్ ట్యాక్స్ రేట్లు వర్తిస్తాయంది.
Similar News
News November 13, 2025
ఉచితంగానే సదరం స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్: సత్యకుమార్ యాదవ్

AP: దివ్యాంగుల పెన్షన్ కోసం సదరం స్లాట్ బుకింగ్ రేపట్నుంచి ప్రారంభమవుతుందని మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఇప్పటికే స్లాట్ బుకింగ్ చేసుకున్న 10వేల మందికి తొలి ప్రాధాన్యమిస్తామన్నారు. దివ్యాంగుల ఆర్థికస్థితిని పరిగణనలోకి తీసుకొని స్లాట్ బుకింగ్, సర్టిఫికెట్ ముద్రణకు గతంలో ₹40 చొప్పున ఉన్న ఫీజును రద్దు చేసినట్లు చెప్పారు. సదరం సర్టిఫికెట్ల ఆధారంగానే కొత్త పెన్షన్లను అధికారులు మంజూరు చేస్తారు.
News November 13, 2025
హైదరాబాద్ మెట్రో: 4, 6 కోచ్‌లతో రైళ్లు!

TG: హైదరాబాద్ మెట్రోలో రద్దీ ఎక్కువగా ఉండే రూట్లలో 4, 6 కోచ్‌ల రైళ్లను ప్రవేశపెట్టాలని HMRL యోచిస్తోంది. ఇందుకోసం 40-60 కోచ్‌లను తీసుకురానున్నట్లు HMRL ఎండీ సర్ఫరాజ్ తెలిపారు. ప్రస్తుతం 3 మార్గాల్లో 3 కోచ్‌లతో 56 రైళ్లు తిరుగుతున్నాయని పేర్కొన్నారు. వీటిలో ఎలాంటి మార్పులు చేయకుండా కొత్తగా 4, 6 కోచ్‌లతో ట్రైన్లను తీసుకొస్తామని వివరించారు. ఇందుకు రెండేళ్లకు పైగా సమయం పట్టొచ్చని చెప్పారు.
News November 13, 2025
ఒక్క జూమ్ కాల్‌తో ₹1.35లక్షల కోట్ల పెట్టుబడి: లోకేశ్

AP: ₹1.35లక్షల కోట్ల పెట్టుబడి పెట్టే ఆర్సెలర్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను కేవలం జూమ్ కాల్‌తో రప్పించామని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు. విశాఖలో 5 సంస్థలకు ఆయన భూమిపూజ చేశారు. గూగుల్ AI హబ్‌కు నెలాఖరున శంకుస్థాపన చేస్తామని తెలిపారు. TCS, కాగ్నిజెంట్ సహా అనేక ఐటీ జెయింట్స్ రాష్ట్రానికి వస్తున్నాయని చెప్పారు. 2026 జూన్‌కు భోగాపురం ఎయిర్ పోర్టు నుంచి అంతర్జాతీయ కనెక్టివిటీ ప్రారంభమవుతుందని వివరించారు.


