News November 25, 2024
28న ఓటీటీలోకి ‘లక్కీ భాస్కర్’
వెంకీ అట్లూరి డైరెక్షన్‌లో దుల్కర్ సల్మాన్-మీనాక్షి చౌదరి నటించిన ‘లక్కీ భాస్కర్’ మూవీ ఓటీటీలోకి రానుంది. ఈ నెల 28 నుంచి తెలుగు, తమిళం, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్‌ఫ్లిక్స్ వెల్లడించింది. గత నెల 31న విడుదలైన ఈ సినిమా రూ.100 కోట్లకుపైగా కలెక్షన్లు సాధించి సూపర్‌హిట్‌గా నిలిచిన విషయం తెలిసిందే.
Similar News
News November 25, 2024
ఇతడు వేలంలోకి వస్తే..?
ప్రపంచ క్రికెట్‌లో అన్ని ఫార్మాట్లలో బెస్ట్ బౌలర్ ఎవరు అంటే.. అందరూ చెప్పే పేరు బుమ్రా. ఈ స్టార్ బౌలర్‌ను ముంబై ఇండియన్స్ రూ.18 కోట్లకు రిటైన్ చేసుకుంది. ఒకవేళ బుమ్రా వేలంలోకి వస్తే రికార్డులు బద్దలు అవుతాయని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. రూ.27 కోట్లతో పంత్ అత్యధిక ధర పలకగా.. బుమ్రా కచ్చితంగా అంతకంటే ఎక్కువే పలుకుతారని చెబుతున్నారు. మరి బుమ్రాకు ఎన్ని కోట్లు వస్తాయో కామెంట్ చేయండి.
News November 25, 2024
ఐశ్వర్యపై ఇంట్రెస్టింగ్ వ్యాఖ్యలు చేసిన అభిషేక్
త్వరలో విడాకులు తీసుకోబోతున్నారన్న వార్తల నేపథ్యంలో భార్య ఐశ్వర్యరాయ్‌పై బాలీవుడ్ హీరో అభిషేక్ బచ్చన్ చేసిన వ్యాఖ్యలు వైరలవుతున్నాయి. ‘నేను బయటకు వెళ్లి సినిమాలు చేయగలుగుతున్నా అంటే ఇంట్లో ఐశ్వర్య ఉందన్న ధైర్యమే. అందుకు నేను అదృష్టవంతుడిని. ఆమెకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. పిల్లలు కూడా తండ్రిని మూడో వ్యక్తిగా చూడరు. ఎందుకంటే వారికి పేరెంట్స్ ఇద్దరూ ఒక్కటే’ అని చెప్పారు.
News November 25, 2024
వాహనాలపై రోడ్ ట్యాక్స్ పెంపునకు కసరత్తు?
TG: ₹లక్ష పైన విలువున్న టూవీలర్స్, ₹10 లక్షల పైన విలువున్న కార్లకు రోడ్డు ట్యాక్స్ పెంచేందుకు ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం. రాష్ట్రంలో ప్రస్తుతం కార్లకు 13-18%, టూవీలర్స్‌కు 9-12% ట్యాక్స్ శ్లాబులున్నాయి. గరిష్ఠంగా కేరళలో 21%, తమిళనాడులో 20% పన్ను ఉన్నట్లు గుర్తించిన అధికారులు ఆ మేరకు ఇక్కడా రేట్లు సవరించాలని నిర్ణయించారు. త్వరలోనే మంత్రివర్గ ఉపసంఘానికి నివేదిక సమర్పించనున్నట్లు తెలుస్తోంది.