News March 1, 2025

తగ్గేదే లే అంటోన్న ‘లక్కీ భాస్కర్’

image

థియేటర్ ఆడియన్స్‌ను మెప్పించిన దుల్కర్ సల్మాన్ మూవీ ‘లక్కీ భాస్కర్’.. ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. మూవీలోని భాస్కర్ పాత్రకు ఫ్యామిలీ ఆడియన్స్ ముగ్ధులయ్యారు. గతేడాది నవంబర్ 28న ‘నెట్‌ఫ్లిక్స్’లో రిలీజ్ కాగా.. అత్యధిక వ్యూస్(19.4M) సాధించిన తెలుగు సినిమాగా నిలిచింది. ఆ తర్వాత హాయ్ నాన్న (17.3M), గుంటూరుకారం (16.6M), సలార్ (15.4M), దేవర (12M), కల్కి(10.3M), సరిపోదా శనివారం (9.5M) ఉన్నాయి.

Similar News

News March 1, 2025

కొవ్వెక్కిన పంది, నీతిమాలిన జెలెన్‌స్కీ: రష్యా ఫైర్

image

డొనాల్డ్ ట్రంప్, జెలెన్‌స్కీ వాగ్వాదంపై రష్యా ఘాటుగా స్పందించింది. ఎవరి మద్దతూ లేకుండా ఒంటరిగా యుద్ధం చేశానన్న జెలెన్‌స్కీ ఓ నీతిమాలిన వాడంటూ రష్యా ఫారిన్ మినిస్ట్రీ ప్రతినిధి మరియా జఖారోవా విమర్శించారు. వైట్‌హౌస్‌లో అతడికి తగిన శాస్తి జరిగిందన్నారు. మాజీ ప్రెసిడెంట్, సెక్యూరిటీ కౌన్సిల్ డిప్యూటీ హెడ్ దిమిత్రి మెద్వెదేవ్ అయితే ఏకంగా ‘కొవ్వెక్కిన పంది’ అని తిట్టారు.

News March 1, 2025

సెమీఫైనల్.. ఆస్ట్రేలియాకు బిగ్ షాక్!

image

ఛాంపియన్స్ ట్రోఫీలో సెమీ ఫైనల్‌కు ముందు ఆస్ట్రేలియా జట్టుకు మరో షాక్ తగిలింది. ఆ జట్టు ఓపెనర్ మాథ్యూ షార్ట్ సెమీస్‌లో ఆడేది అనుమానమేనని కెప్టెన్ స్టీవ్ స్మిత్ చెప్పారు. షార్ట్ గాయంతో బాధపడుతున్నారని పేర్కొన్నారు. అతని స్థానంలో మెక్ గుర్క్, అరోన్, కూపర్‌లలో ఒకరిని తీసుకుంటామని చెప్పారు. నిన్న వర్షం కారణంగా రద్దైన మ్యాచులో షార్ట్ 15 బంతుల్లో 20 పరుగులు చేసి ఔటయ్యారు.

News March 1, 2025

100 రోజుల్లోపే శిక్ష పడేలా పనిచేయాలి: హోంమంత్రి అనిత

image

AP: నేరం చేసిన వంద రోజుల్లోపే శిక్షలు పడేలా పనిచేయాలని ట్రైనింగ్ పూర్తి చేసుకున్న SIలకు హోంమంత్రి అనిత సూచించారు. నిజాయితీగా ప్రజల రక్షణకు ముందుకెళ్లాలన్నారు. శిక్షణ పూర్తి చేసుకున్న ఎస్సైల పాసింగ్ పరేడ్‌లో ఆమె పాల్గొన్నారు. మొత్తం 395 మంది ఎస్సైలుగా శిక్షణ పూర్తి చేసుకోగా వీరిలో 97 మంది మహిళలు ఉన్నారు. మహిళలు ఇంత సంఖ్యలో ఉండటం గర్వకారణమని అన్నారు. ఈ పరేడ్‌కు డీజీపీ హరీశ్ గుప్తా హాజరయ్యారు.

error: Content is protected !!