News February 26, 2025

రికార్డు సృష్టించిన ‘లక్కీ భాస్కర్’

image

స్టార్ నటుడు దుల్కర్‪‌ సల్మాన్‌, మీనాక్షి చౌదరి జంటగా వెంకీ అట్లూరి తెరకెక్కించిన ‘లక్కీ భాస్కర్’ సినిమా థియేటర్లతో పాటు ఓటీటీలోనూ దుమ్మురేపుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లోకి వచ్చిన 13 వారాల నుంచి ఈ చిత్రం ట్రెండ్ అయి రికార్డు సృష్టించిందని మేకర్స్ ప్రకటించారు. వరుసగా ఇన్ని వారాలు ట్రెండ్ అయిన తొలి సౌత్ఇండియా మూవీ ‘లక్కీ భాస్కర్’ అని ఓ పోస్టర్ విడుదల చేశారు. మీరూ ఈ సినిమా చూశారా?

Similar News

News November 12, 2025

టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్‌లో ఉద్యోగాలు

image

ముంబైలోని టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సోషల్ సైన్సెస్(<>TISS<<>>) 2 అడ్మినిస్ట్రేటివ్ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తులు కోరుతోంది. అర్హతగల అభ్యర్థులు ఈ నెల 16వరకు అప్లై చేసుకోవచ్చు. డిగ్రీ లేదా పీజీ ఉత్తీర్ణతతో పాటు పని అనుభవం ఉండాలి. ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఫీజు రూ.500, SC, ST, PWBDలకు రూ.125. వెబ్‌సైట్: https://tiss.ac.in

News November 12, 2025

టమాటాలో శిలీంద్రం ఎండు తెగులును ఎలా నివారించాలి?

image

శిలీంద్రం ఎండు తెగులు సోకిన టమాటా మొక్కలను పొలం నుంచి పీకి దూరంగా కాల్చేయాలి. పంటకు సరిపడినంత నీటి తడులు అందించాలి. ఎక్కువగా నీరు పెట్టకూడదు. తెగులు సోకిన మొక్కలను తొలగించిన నేలను.. లీటరు నీటికి మాంకోజెబ్ 3గ్రాములు కలిపి బాగా తడపాలి. తెగులు ఆశించిన మొక్క చుట్టూ ఉన్న మొక్కల వద్ద కూడా ఈ ద్రావణంతో నేలను బాగా తడపాలి. ట్రైకోడెర్మావిరిడేని వేపపిండి, పశువుల ఎరువుతో కలిపి నాటేముందు పొలంలో చల్లుకోవాలి.

News November 12, 2025

మరోసారి ఢిల్లీకి సీఎం రేవంత్

image

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి మరోసారి ఢిల్లీకి వెళ్లనున్నారు. ఇవాళ రాత్రి 7 గంటలకు ఆయన హస్తినకు బయల్దేరుతారు. రేపు పలువురు కేంద్ర మంత్రులతో రేవంత్ భేటీ అయ్యే అవకాశం ఉంది. అటు కాంగ్రెస్ పెద్దలను కూడా సీఎం కలుస్తారని సమాచారం.