News October 8, 2024
అదృష్టం: 32 ఓట్ల మెజార్టీతో గెలిచాడు!

హరియాణాలో బీజేపీ అభ్యర్థి స్వల్ప ఆధిక్యంతో గట్టెక్కారు. ఉచన కలాన్‌లో బీజేపీ అభ్యర్థి దేవేందర్ చతర్ కాంగ్రెస్ క్యాండిడేట్ బ్రిజేంద్ర సింగ్‌పై 32 ఓట్ల తేడాతో గెలిచారు. దేవేందర్‌కు 48,968 ఓట్లు రాగా బ్రిజేంద్రకు 48,936 ఓట్లు పోలయ్యాయి. కాగా సాయంత్రం 5 గంటలకు ఈసీ లెక్కల ప్రకారం హరియాణాలో బీజేపీ 39 సీట్లలో గెలిచి, తొమ్మిదింటిలో ఆధిక్యంలో ఉంది. కాంగ్రెస్ 31 సీట్లలో గెలిచి, ఆరింట్లో లీడ్‌లో ఉంది.
Similar News
News March 26, 2026
ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దు: నిర్మల్ కలెక్టర్

వంట గ్యాస్, పెట్రోల్ డీజిల్ పై సోషల్ మీడియా లేదా ఇతర మార్గాల్లో వ్యాపిస్తున్న అసత్య ప్రచారాలను నమ్మి ప్రజలు పానిక్ బయ్యింగ్‌కు పాల్పడవద్దని కలెక్టర్ అభిలాష అభినవ్ జిల్లా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. జిల్లా యంత్రాంగం నిరంతరం పరిస్థితిని పర్యవేక్షిస్తోందని, ప్రజలకు అవసరమైన ఇంధన వనరులు నిరంతరం అందుబాటులో ఉంటాయని భరోసా ఇచ్చారు. ప్రజలు అనవసరంగా ఆందోళన చెందవద్దన్నారు.
News March 26, 2026
అమరావతికి చట్టబద్ధత కల్పించేలా తీర్మానం

AP: సీఎం చంద్రబాబు అధ్యక్షతన భేటీ అయిన క్యాబినెట్ పలు నిర్ణయాలు తీసుకుంది.
➤ రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించేలా తీర్మానం
➤ మైనింగ్ లీజులను వడ్డెర సొసైటీలకు కేటాయించేందుకు క్యాబినెట్ ఆమోదం
➤ ఖనిజ లీజుల కేటాయింపులో ప్రీమియం, సీనరేజ్ ఫీజుల్లో 50% రాయితీ
➤ 96 jr., sr. సివిల్ జడ్జిల కోర్టుల ఏర్పాటుకు ఆమోదం
➤ 2025-26 ఏడాదిలో ఆస్తి పన్ను బకాయిలపై వడ్డీ మాఫీ
News March 26, 2026
నియోజకవర్గాలు 50శాతం పెరుగుతాయి: చంద్రబాబు

నియోజకవర్గాల పునర్విభజనపై ఏపీ సీఎం చంద్రబాబు స్పందించారు. 2029 ఎన్నికల నాటికి రాష్ట్రంలో 50శాతం నియోజకవర్గాలు పెరుగుతాయన్నారు. దీని ద్వారా ఎక్కువ మందికి రాజకీయ అవకాశాలు వస్తాయని చెప్పారు. నియోజకవర్గాల పెంపు వల్ల పరిపాలనా సౌలభ్యం పెరుగుతుందని, దీనిపై ప్రజలకు ఇప్పటి నుంచే అవగాహన కల్పించాలని మంత్రులకు సూచించారు.


