News October 26, 2024
Lunch Break: భారత్ 81/1

న్యూజిలాండ్‌తో రెండో టెస్టులో భారత్ లక్ష్యం దిశగా సాగుతోంది. 359 రన్స్ టార్గెట్‌తో బరిలోకి దిగిన IND లంచ్ సమయానికి 81/1 రన్స్ చేసింది. రోహిత్ 8 పరుగులు చేసి ఔట్ కాగా జైస్వాల్ 46, గిల్ 22 రన్స్‌తో క్రీజులో ఉన్నారు. భారత్ విజయానికి మరో 278 పరుగులు కావాలి. ఆట ఇంకా రెండు రోజులు మిగిలి ఉంది. మరి భారత్ ఈ టెస్ట్ గెలుస్తుందా? తడబడుతుందా? కామెంట్ చేయండి.
Similar News
News November 22, 2025
NZB: ఇద్దరు SIలకు VRకు బదిలీ

నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ పరిధిలో జరిగిన బదిలీల్లో ఇద్దరు SIలకు VRకు బదిలీ చేసి అంతలోనే అడ్మినిస్ట్రేషన్ గ్రౌండ్ పేరిట మళ్లీ స్టేషన్లకు అటాచ్ చేశారు. ఇందులో భాగంగా NZBరూరల్ పోలీస్ స్టేషన్ ఎస్ఐ-1గా పని చేసిన మహమ్మద్ ఆరిఫ్‌ను డిచ్పల్లి పోలీస్ స్టేషన్‌కు, నవీపేట ఎస్ఐగా పనిచేస్తున్న వినయ్‌ను నిజామాబాద్ 6వ టౌన్‌కు అటాచ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.
News November 22, 2025
భారీగా తగ్గిన ఉల్లి.. పెరిగిన కూరగాయల ధరలు

తెలుగు రాష్ట్రాల్లో ఉల్లి ధరలు భారీగా తగ్గుతున్నాయి. HYD మార్కెట్లలో రూ.100కే 5 కేజీల ఉల్లి విక్రయిస్తున్నారు. అటు ధర రాక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే మిగతా కూరగాయల ధరలు మాత్రం ఆకాశాన్నంటుతున్నాయి. కేజీ టమాటా రూ.50-80 వరకు విక్రయిస్తున్నారు. పచ్చిమిర్చి రూ.100, బెండకాయ రూ.80, బీరకాయ రూ.80, వంకాయ రూ.110 వరకు పలుకుతున్నాయి.
News November 22, 2025
ఐబీలో ACIO పోస్టుల CBT-1 ఫలితాలు విడుదల

ఇంటెలిజెన్స్ బ్యూరోలో 3,717 అసిస్టెంట్ సెంట్రల్ ఇంటెలిజెన్స్ ఆఫీసర్(ACIO) పోస్టులకు సంబంధించి సీబీటీ-1 ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు https://www.mha.gov.in/ వెబ్సైట్లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చు. సెప్టెంబర్ 16 నుంచి 18 వరకు పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే.


