News May 27, 2024
స్కూళ్లలో మధ్యాహ్న భోజనం.. వంట సిబ్బందికి స్పెషల్ ట్రైనింగ్

AP: ప్రభుత్వ స్కూళ్లలో మరింత నాణ్యమైన, రుచికరమైన భోజనాన్ని అందించడానికి ప్రభుత్వం చర్యలు చేపట్టింది. మధ్యాహ్న భోజనం వండే సిబ్బందికి వంటకాల తయారీపై విజయవాడలోని తాజ్ హోటల్‌లో పనిచేసే చెఫ్‌లతో శిక్షణ ఇప్పించింది. అంతేకాకుండా తిరుపతి తాజ్ హోటల్ చెఫ్‌లతో వంటల చిట్కాలు, ఆయా వంటలతో కలిగే లాభాల గురించి వీడియోలను రూపొందించింది. వాటిని పాఠశాల విద్యాశాఖ నిర్వహించే సోషల్ మీడియా ఖాతాల్లో అప్‌లోడ్ చేసింది.
Similar News
News February 16, 2026
కొబ్బరి చెట్లకు నీరు ఇలా అందిస్తే మంచిది

కొబ్బరి తోటల్లో నేల తేమ ఆరకుండా, భూమి స్వభావాన్ని, వాతావరణాన్ని బట్టి నీటిని సక్రమంగా అందించాలి. డెల్టా ప్రాంతాల్లో నీటిని తోటలలో పారించే పద్ధతిని అనుసరిస్తున్నారు. అయితే ఈ పద్ధతిలో సేద్యపు నీరు ఎక్కువగా వృథా అయ్యి తెగుళ్లు కూడా తొందరగా ఇతర మొక్కలకు వ్యాపించే అవకాశం ఉంది. చెట్ల చుట్టూ పళ్లెం చేసి బేసిన్ పద్ధతి ద్వారా లేదా డ్రిప్ విధానంలో తోటలకు నీటిని అందించడం వల్ల నీటి వృథాను అరికట్టవచ్చు.
News February 16, 2026
ఇంటర్వ్యూతో IRCTCలో ఉద్యోగాలు

<
News February 16, 2026
అమావాస్య రోజున పిల్లలు పుట్టడం అశుభమా?

దీని గురించి వేద పురాణాల్లో అశుభంగా ఎక్కడా పేర్కొనలేదని పండితులు చెబుతున్నారు. ‘ఈ తిథి పితృదేవతల ఆశీస్సులు గల పవిత్రమైన రోజు. అమావాస్య నాడు పుట్టిన పిల్లలు బలమైన ఆధ్యాత్మికత, తెలివితేటలు, లోతైన ఆలోచనా ధోరణి కలిగి ఉంటారు. ఏవైనా స్వల్ప దోషాలు ఉన్నాయని భావిస్తే శాంతి పూజలు జరిపించుకోవాలి. అలా నివృత్తి చేసుకోవచ్చు. పిల్లల భవిష్యత్తు వారి కర్మ, పెంపకంపైనే ఆధారపడి ఉంటుంది కానీ తిథిపై కాదు’ అంటున్నారు.


